సినిమా టికెట్ల రేట్లు తగ్గించడంలో ఉన్న శ్రద్ధ.. సిమెంటు, ఇసుక ధరలు తగ్గించడంలో లేదెందుకు?: రామకృష్ణ

ABN , First Publish Date - 2022-01-06T17:45:21+05:30 IST

సిమెంటు, ఇసుక రేట్లు తగ్గించి భవన నిర్మాణ రంగాన్ని ఆదుకోవాలని రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సినిమా టికెట్ల రేట్లు తగ్గించడంలో ఉన్న శ్రద్ధ.. సిమెంటు, ఇసుక ధరలు తగ్గించడంలో లేదెందుకు?: రామకృష్ణ

విజయవాడ: సిమెంటు, ఇసుక రేట్లు తగ్గించి భవన నిర్మాణ రంగాన్ని ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్ సర్కార్‌కు సినిమా టికెట్ల రేట్లు తగ్గించడంలో ఉన్న శ్రద్ధ సిమెంటు, ఇసుక ధరలు తగ్గించడంలో లేదెందుకని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక గత రెండున్నర ఏళ్ళ కాలంలో భవన నిర్మాణ రంగం కుదేలైందని విమర్శించారు. అల్ట్రాటెక్, భారతి సిమెంట్ రేట్లు అధికంగా ఉన్నాయన్నారు. పనులు కొరవడి భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పుడు సిమెంటు ధరలు పెరగడంతో కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-01-06T17:45:21+05:30 IST