వాస్తవాలను ప్రభుత్వం దుర్మార్గంగా కప్పిపుచ్చుతోంది: రామకృష్ణ

ABN , First Publish Date - 2022-03-20T21:04:40+05:30 IST

వాస్తవాలను దుర్మార్గంగా ప్రభుత్వం కప్పిపుచ్చుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు.

వాస్తవాలను ప్రభుత్వం దుర్మార్గంగా కప్పిపుచ్చుతోంది: రామకృష్ణ

విజయవాడ: కల్తీ సారా తాగి 25 మంది జంగారెడ్డిగూడెంలో చనిపోయారని, వాస్తవాలను దుర్మార్గంగా ప్రభుత్వం కప్పిపుచ్చుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో సీఎం జగన్ అబద్దాలు చెప్పి దిగజారారన్నారు. స్ధానికంగా బాధితుల ఇళ్ళ వద్దకు వెళ్ళి మేము 25 మంది మృతుల లిస్టు సేకరించామన్నారు. ఎక్సైజు మంత్రిని, సజ్జలను జంగారెడ్డిగూడెంకు పంపాలని సూచించారు. వారిపై తమకు నమ్మకం ఉందన్నారు. సహజమరణాలని ప్రభుత్వం అబద్ధాలు చెపుతోందన్నారు. కల్తీసారా అమ్ముతున్నారని ప్రభుత్వమే  చెపుతోందని, 148 కేసులు.. 156 మందిపై కేసు పెట్టారని, 39,700 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసినట్లు ఎక్సైజుశాఖ అధికారులు చెపుతున్న ఈ లెక్కలు తప్పా?.. సీఎం జగన్ చెప్పేది తప్పా?... అని ప్రశ్నించారు. అవాస్తవాలు చెప్పినందుకు ముఖ్యమంత్రి అసెంబ్లీలో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గత బ్రాండ్లకు సీఎం నిషేధం పెట్టారని, సొంత మద్యం అమ్మించిన ఏకైక వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. ప్రభుత్వ మద్యం రేటు పెట్టలేక.. ఈ మందు తాగి చనిపోయారని, దీనికి కారణమైన వారిపై ఐపీసీ 302 కింద కేసులు నమోదు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-03-20T21:04:40+05:30 IST