అధిక పన్నులు, చార్జీలు వసూలు చేస్తున్నప్పుడు రోడ్లు ఎందుకు వేయరు?: Ramakrishna

ABN , First Publish Date - 2022-07-15T15:35:36+05:30 IST

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉందని..

అధిక పన్నులు, చార్జీలు వసూలు చేస్తున్నప్పుడు రోడ్లు ఎందుకు వేయరు?: Ramakrishna

విజయవాడ (Vijayawada): రోమ్ (Rome) నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ (fiddle) వాయించినట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) వైఖరి ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఒకపక్క పోలవరం ప్రాంతం ముంపునకు గురై నిర్వాసితులు లబోదిబోమంటున్నారని, మరోవైపు రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల (Municipal workers) సమ్మె (Strike) కొనసాగుతోందని, ఏపీ (AP)లో రోడ్లన్నీ గోతులు, గుంతలమయంగా మారి ప్రమాదకర స్థితికి చేరాయన్నారు. ప్రభుత్వం అధిక పన్నులు, చార్జీలు వసూలు చేస్తున్నప్పుడు రోడ్లు ఎందుకు వేయరని ఆయన ప్రశ్నించారు. అసలే వర్షాలు, వరదలు సంభవిస్తున్న తరుణంలో వ్యాధులు ప్రబలి, అనారోగ్యకర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించి, సమ్మెను విరమింపచేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవచూపాలని, పోలవరం నిర్వాసితులకు తక్షణ సహాయం అందించి ఆదుకోవాలని రామకృష్ణ కోరారు.

Updated Date - 2022-07-15T15:35:36+05:30 IST