ఆలయాలకే శఠగోపం పెట్టేందుకు సిద్ధమైన Jagan Sarkar: Ramakrishna

ABN , First Publish Date - 2022-07-17T19:46:09+05:30 IST

ఆలయాలకు శఠగోపం పెట్టేందుకు జగన్ సర్కార్ సిద్ధమైందని రామకృష్ణ విమర్శించారు.

ఆలయాలకే శఠగోపం పెట్టేందుకు సిద్ధమైన Jagan Sarkar: Ramakrishna

ప్రకాశం (Prakasam) జిల్లా: ఆలయాలకు శఠగోపం పెట్టేందుకు జగన్ సర్కార్ (Jagan Sarkar) సిద్ధమైందని సీపీఐ (CPI) రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రూ. 500 కోట్లు లక్ష్యంగా దేవాలయాల ఎఫ్డీలను రద్దు చేయమని ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు ఇవ్వటం తగదన్నారు. రాష్ట్రంలోని 15 వేల దేవాలయాల ఫిక్స్‌డ్ డిపాజిట్లు (Fixed Deposits) రద్దుచేసి, సిజిఎఫ్‌ (CGF)కు బదలాయించాలనుకోవడం దుర్మార్గమన్నారు. జగన్ సర్కార్ నిర్ణయంతో ఏపీ (AP)లోని ఆలయాల పరిస్థితి దయనీయంగా మారే ప్రమాదం ఉందన్నారు. గత దేవాదాయశాఖ మంత్రి సిజిఎఫ్ నిధులను మళ్లించినట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.


వరదలతో ప్రజలు ఇబ్బంది పడటం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదాల వల్ల జరుగుతోందని రామకృష్ణ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు (Polavaram Project)ను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా.. ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించ లేదని విమర్శించారు. జాతీయ ప్రాజెక్టు అన్నప్పుడు కేంద్రం బాధ్యత తీసుకోలేదని, సీఎం జగన్ మన్ను తిన్న పాములా ఉన్నారని అన్నారు. కేంద్రాన్ని ఏ విషయంలో ముఖ్యమంత్రి ప్రశ్నించటం లేదని విమర్శించారు. పోలవరం కాపర్ డ్యాం మీద మట్టి వేస్తే నిలబడుతుందా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ (PM Modi) వరద బాధిత ప్రాంతాన్ని పరిశీలించాలన్నారు.


ఏపీలో జనం మందు తాగి చనిపోయినా సీఎం జగన్ మాట్లాడటం లేదని రామకృష్ణ మండిపడ్డారు. జగన్ బ్రాండ్లు తాగి జనం చనిపోతున్నందుకు ఆయన సిగ్గుపడాలన్నారు. మద్యపాన నిషేధం 9Prohibition of alcohol) హామీ ఏమైందని ప్రశ్నించారు. 9వేల కోట్ల రూపాయల మద్యం ఆదాయాన్ని రూ. 22 వేల కోట్లకు పెంచారని దుయ్యబట్టారు. మద్యం మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రతీ పథకానికి జగనన్న పథకం అని పేర్లు పెట్టుకోవటానికి సిగ్గుండాలని రామకృష్ణ అన్నారు.

Updated Date - 2022-07-17T19:46:09+05:30 IST