కేటీఆర్ చెప్పిన దానిలో అవాస్తవాలు ఏమున్నాయి: రామకృష్ణ

ABN , First Publish Date - 2022-04-30T22:10:37+05:30 IST

ప్రజలు ధరల పెరుగుదలతో బాధపడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

కేటీఆర్ చెప్పిన దానిలో అవాస్తవాలు ఏమున్నాయి: రామకృష్ణ

 అమరావతి: ప్రజలు ధరల పెరుగుదలతో బాధపడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ‘‘మరో పక్క విద్యుత్ చార్జీలు, కోతలు, ఆర్టీసీ ఛార్జీలతో హింస పెడుతున్నారు.  ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు 64 రూపాయలు ఉండే పెట్రోల్ ఇవాళ 122 రూపాయలు అయింది.పెట్రోల్ పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే 10 రూపాయలు రాష్ట్రంలో అధికంగా ఉంది.ప్రతి ఒక్క వస్తువు ధర రాష్ట్రంలో విపరీతంగా పెంచారు, ఆస్తి పన్ను విపరీతంగా పెంచారు,చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఇది.రాబోయే 3 సంవత్సరాల పాటు ట్రూ అప్ చార్జీలు వసూలుకు రంగం సిద్ధం చేశారు.బహిరంగ మార్కెట్ కంటే అదాని దగ్గర అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు.రాజకీయంగా కూడా అదానితో సత్సంబంధాలు కలిగి ఉన్నారు.


రోడ్ల గురించి కేటీఆర్ చెప్పిన దానిలో అవాస్తవాలు ఏమున్నాయి.శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా మంత్రులు సిగ్గులేకుండా మూకుమ్మడిగా సమాధానం చెప్తున్నారు.తాము చెప్తే వినలేదు, పక్క రాష్ట్రం మంత్రి చెప్తే మొత్తం మంత్రులు అబద్ధాలు చెప్తున్నారు.ప్రమాణ స్వీకారం చేసినప్పుడు విద్యుత్ చార్జీలు తగ్గిస్తా అని చెప్పి 7 సార్లు చార్జీలు పెంచారు.అదానికి అమ్ముడు పోయారు , అదానికి ఇచ్చే కమిషన్లకు అమ్ముడుపోయారు.ధరల పెంపు ,నిత్యావసరాల ధరల పెరుగుదలకు నిరసనగా రాష్ట్ర సచివాలయం వద్ద మే 9వ తేదీన నిరసన చేపడతాం.ధర్నా చేయాలంటే పోలీస్‌లను పంపిస్తావు, అసెంబ్లీ జరిగేటప్పుడు ధర్నా చేయడం ఆనవాయితీ.పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు ఢిల్లీలో ధర్నాలు చేస్తారు ,పార్లమెంట్ కంటే నువ్వేమన్న గొప్ప? అడ్డుకోవడానికి ఇదేమన్నా మీ అబ్బా జాగీరా? ఎలా అడ్డుకుంటారా చూస్తా, నిరసన చేసి తీరుతాం’’ అని రామకృష్ణ పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-04-30T22:10:37+05:30 IST