
అమరావతి: బీజేపీ నేత సోము వీర్రాజు వ్యాఖ్యలను సీపీఐ నేత రామకృష్ణ ఖండించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోము వీర్రాజు కడప జిల్లా ప్రజలను ఖూనీకోర్లుగా చిత్రీకరించడం తగదన్నారు. సోము వీర్రాజుకు మతిభ్రమించి అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఆరేడు దశాబ్దాల క్రితమే కడపలో ఎయిర్పోర్ట్ ఉందన్న విషయం వీర్రాజుకు తెలియనట్టుందని చెప్పారు. అనుచిత వ్యాఖ్యలు, మత రాజకీయాలతో ఏపీలో లబ్ధి పొందేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. సోము వీర్రాజు ఇకనైనా పిచ్చి ప్రేలాపనలు కట్టిపెట్టాలని రామకృష్ణ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి