Advertisement

రమణ గెలుపు అభివృద్ధికి మలుపు

Mar 6 2021 @ 22:48PM
:సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న రావుల చంద్రశేఖర్‌ రెడ్డి

టీడీపీ జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి

అచ్చంపేట టౌన్‌, మార్చి 6 : టీడీపీ అధ్యక్షుడు రమణ గెలుపు తెలంగాణ ప్రజల అభివృద్ధికి మలుపు అవుతుందని  ఆ పార్టీ జాతీయ పొలిట్‌ బ్యూరో సభ్యులు చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని పటేల్‌ ఫంక్షన్‌ హాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఉద్యోగ, నిరుద్యోగులు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని, దీన్ని సద్వినియోగం చేసుకొని ఎమ్మెల్సీ అభ్యర్థి రమణ గెలుపునకు కృషి చేయాలన్నారు.  కార్యక్రమంలో జాతీయ అధికార ప్రతినిధి నర్సిరెడ్డి, నాయకులు రాములు, బక్కయ్య, రమణ, రాజు, కాశన్న పాల్గొన్నారు.


Follow Us on:
Advertisement