ఆర్టీసీ బస్సులు మెయింటెనెన్స్ లేక ప్రమాదాలకు గురవుతున్నాయి: నిమ్మల

Published: Thu, 16 Dec 2021 12:41:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 ఆర్టీసీ బస్సులు మెయింటెనెన్స్ లేక  ప్రమాదాలకు గురవుతున్నాయి: నిమ్మల

ప.గో.జిల్లా: జల్లేరు వాగులో ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు అక్టోబర్ 20వ తేదీన అశ్వారావుపేట వద్ద స్టీరింగ్ పట్టేసి ఓ బైక్‌ను ఢీ కొట్టి ఒకరి మృతికి కారణమైందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. గురువారం పాలకొల్లులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి రోజు ఆర్టీసీ బస్సులు మెయింటెనెన్స్ లేక ప్రమాదాలకు గురవుతున్నాయన్నారు. ఈ ప్రమాదాల్లో ప్రజల విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జల్లేరు వాగు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 25 లక్షల పరిహారం  చెల్లించాలని, బస్సు ప్రమాదంపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని రామానాయుడు డిమాండ్ చేశారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.