రామన్న కతువకు భారీగా వరద

ABN , First Publish Date - 2021-07-25T06:07:48+05:30 IST

మండలంలోని చినగానిపల్లె గ్రామసమీపాన రామన్నకతువకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది.

రామన్న కతువకు భారీగా వరద
రామన్నకతువ నుంచి ప్రవహిస్తున్న నీరు


రాచర్ల, జూలై 24 : మండలంలోని చినగానిపల్లె గ్రామసమీపాన రామన్నకతువకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. గత రెండు రోజులుగా నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ నీరంతా నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ సమీపంలోని నెమలిగుండంలోకి దూకి అక్కడి నుంచి రామన్నకతువకు నీరు చేరుతున్నది. రెండు రోజులుగా వస్తున్న వరద ప్రభావంతో రామన్నకతువ కూడా నిండి నీరు ప్రవహిస్తూ చోళ్లవీడు గ్రామంలోని గుండ్లకమ్మ మీదుగా కంభం చెరువుకు చేరుతున్నది.


Updated Date - 2021-07-25T06:07:48+05:30 IST