‘రామన్న యూత్‌’ సందడి

Published: Wed, 06 Jul 2022 00:17:52 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రామన్న యూత్‌ సందడి

అభయ్‌ బేతిగంటి కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘రామన్న యూత్‌’. రజినీ నిర్మాత. ఇటీవల ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి విడుదల చేశారు. ‘‘అభయ్‌ మంచి నటుడు. ఇప్పుడు దర్శకుడిగా మారాడు. తనకు ఈ చిత్రం ఘన విజయాన్ని అందించాల’’ని ఆకాంక్షించారు. అభయ్‌ మాట్లాడుతూ ‘‘రొటీన్‌కి భిన్నమైన కథ ఇది. ఓ యువకుడు రాజకీయ నాయకుడిగా మారాలనుకుంటాడు. ఆ తరవాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అనేది వినోదాత్మకంగా చూపిస్తున్నాం. అందరినీ ఆలోచనలో పడేసే చిత్రమిద’’న్నారు. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే విడుదల చేస్తారు. సంగీతం: కమ్రాన్‌. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International