రామతీర్థానికి రామానుజ జీయర్‌ స్వామి

ABN , First Publish Date - 2021-01-25T04:23:40+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీభాష్యకార సిద్ధాంత ఆచార్య పీఠం వ్యవస్థాపకులు త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్‌ స్వామి ఆదివారం రామతీర్థం సందర్శించారు. ప్రధాన అలయంతో పాటు కొండపై ఉన్న కోదండరాముని ఆలయాన్ని కూడా పరిశీలించారు.

రామతీర్థానికి రామానుజ జీయర్‌ స్వామి
జీయర్‌ స్వామికి స్వాగతం పలుకుతున్న అర్చకులు

                 

నెల్లిమర్ల, జనవరి 24:  పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీభాష్యకార సిద్ధాంత ఆచార్య పీఠం వ్యవస్థాపకులు త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్‌ స్వామి ఆదివారం రామతీర్థం సందర్శించారు. ప్రధాన అలయంతో పాటు కొండపై ఉన్న కోదండరాముని ఆలయాన్ని కూడా పరిశీలించారు. రాముడి విగ్రహం ధ్వంసం సంఘటన గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. కొండపై కొత్త ఆలయాన్ని పటిష్టంగా నిర్మించి తిరిగి ప్రతిష్ట, పూజాకార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాగే 15 మంది భక్తులతో కొండ మీద ఆలయం వద్ద శ్రీరామనామంతో పారాయణ చేశారు.


Updated Date - 2021-01-25T04:23:40+05:30 IST