Ramayan రైలులో కాషాయ డ్రెస్ కోడ్‌ ఉపసంహరణ

ABN , First Publish Date - 2021-11-23T12:45:22+05:30 IST

రామాయణ్ రైలులో వెయిటర్స్‌కు కాషాయ దుస్తులు ధరించేలా తీసుకువచ్చిన డ్రెస్ కోడ్‌ను రైల్వేశాఖ ఉపసంహరించుకుంది.

Ramayan రైలులో కాషాయ డ్రెస్ కోడ్‌ ఉపసంహరణ

న్యూఢిల్లీ: రామాయణ్ రైలులో వెయిటర్స్‌కు కాషాయ దుస్తులు ధరించేలా తీసుకువచ్చిన డ్రెస్ కోడ్‌ను రైల్వేశాఖ ఉపసంహరించుకుంది.రామాయణ్ ఎక్స్‌ప్రెస్ రాముడి జీవితానికి సంబంధించిన ప్రదేశాల గుండా వెళుతోంది. రైలులో వెయిటర్స్‌కు కాషాయ దుస్తులతో డ్రెస్ కోడ్ పెట్టడం పట్ల మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన స్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో రామాయణ్ ఎక్స్‌ప్రెస్‌లోని వెయిటర్ల కాషాయ వేషధారణను మారుస్తామని ఐఆర్ సీటీసీటీసీ చెప్పింది. కాషాయరంగు డ్రెస్ కోడ్ వెయిటర్లకు పెట్టడం పట్ల సాధువుల్లోని ఒక వర్గానికి ఆగ్రహాన్ని కలిగించింది. ఇది హిందు మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ఉందని, వెంటనే వారి డ్రెస్‌ కోడ్ మార్చకపోతే డిసెంబర్ 12 వతేదీ నుంచి రామాయణ్ రైలును ఢిల్లీలో ఆపేస్తామని హెచ్చరించారు. 


‘‘వెయిటర్ల వృత్తిపరమైన వస్త్రధారణలో దుస్తులు పూర్తిగా మార్చాం. భక్తులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం’’ అని రైల్వే శాఖ వివరణ ఇచ్చింది.సాధువులు ధరించే తలపాగాతో కాషాయరంగు డ్రెస్ ధరించి,  పవిత్ర రుద్రాక్షలు ధరించడం హిందూ మతాన్న అవమానించడమేనని ఉజ్జయిని అఖాడా పరిషత్ మాజీ ప్రధాన కార్యదర్శి అవదేశ్‌పురి చెప్పారు.దేశంలోని మొట్టమొదటి రామాయణ్ సర్క్యూట్ రైలు నవంబరు 7వతేదీన సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి 17 రోజుల పాటు రాముడి జీవితానికి సంబంధించిన 15 యాత్రా స్థలాల మీదుగా వెళుతోంది.అయోధ్య, ప్రయాగ్, నందిగ్రామ్, జానక్‌పూర్, చిత్రకూట్, సీమర్హి, నాసిక్, హంపీ, రామేశ్వరం ప్రాంతాల్లో మొత్తం 7,500 కిలోమీటర్ల మేర ప్రయాణం సాగుతోంది.


Updated Date - 2021-11-23T12:45:22+05:30 IST