
మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న చిత్రం `ఆచార్య`. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో చిరంజీవితోపాటు రామ్‌చరణ్ కూడా కనిపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు చెర్రీ హాజరయ్యాడు.
ఆ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ సినిమాలో చరణ్.. `సిద్ధ` పాత్రలో కనిపించనున్నాడు. మెడలో రుద్రాక్ష మాలతో, చెవికి పోగుతో ఉన్న చెర్రీ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. `మన `సిద్ధ`కు `ఆచార్య` సెట్లోకి స్వాగతం. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ షూటింగ్‌కు హాజరయ్యార`ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్వీట్ చేసింది.