రమేశ్‌ జార్కిహొళి కేసు.. నివేదిక కోరిన Highcourt

ABN , First Publish Date - 2022-02-04T17:44:29+05:30 IST

రాసలీల సీడీ కేసుకు సంబంధించి విచారణ నివేదికను వెంటనే కోర్టుకు సమర్పించాలని సిట్‌ పోలీసులకు హైకోర్టు గురువారం ఆదేశించింది. రాసలీలల సీడీ వెలుగులోకి రాగానే రమేశ్‌జార్కిహొళి మంత్రి పదవికి రాజీనామా

రమేశ్‌ జార్కిహొళి కేసు.. నివేదిక కోరిన Highcourt

                                           - విస్తరణవేళ కలకలం


బెంగళూరు: రాసలీల సీడీ కేసుకు సంబంధించి విచారణ నివేదికను వెంటనే కోర్టుకు సమర్పించాలని సిట్‌ పోలీసులకు హైకోర్టు గురువారం ఆదేశించింది. రాసలీలల సీడీ వెలుగులోకి రాగానే రమేశ్‌జార్కిహొళి మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన భవిష్యత్తు సిట్‌ పోలీసులు సమర్పించే నివేదికపై ఆధారపడి ఉంది. హైకోర్టు ఆదేశాలతో ఇప్పటికే సమగ్రంగా విచారణ పూర్తి చేసిన సిట్‌ రెండు రోజులలో నివేదిక సమర్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జార్కిహొళిపై నమోదైన అత్యాచార కేసులో ఎటువంటి సాక్ష్యాలు లభించలేదు. ఇదో హనీట్రాప్‌ అని, ఉద్యోగంకోసం అప్పట్లో మంత్రిగా ఉన్న రమేశ్‌జార్కిహొళిని యువతి భేటీ కాలేదని, సదరు యువతి ఇంజనీరింగ్‌ పూర్తి చేయలేదని, రహస్య కెమెరా ద్వారా రికార్డు చేసినట్లు సిట్‌ గుర్తించింది. ఇందుకు సంబంధించి సిట్‌ బీ-రిపోర్టులోనూ స్పష్టం చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో కేబినెట్‌ విస్తరణ సాగనుందనే ప్రచారాలు జోరందుకున్నవేళ మరోసారి మంత్రి పదవికోసం తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ముం బెకి వెళ్లి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను కలిశారు. ఆయన ద్వారా నాగపూర్‌లోని ఆర్‌ఎస్ఎస్‌ అగ్రనేతలు, ఢిల్లీ పెద్దల ద్వారా ప్రయత్నాలు చేయదలిచారు. ఈలోగా హైకోర్టు సూచనతో ఆయనకు కాస్త నిరాశ కలిగింది. 

Updated Date - 2022-02-04T17:44:29+05:30 IST