Advertisement

కాంగ్రెస్‌ నుంచి రమేష్‌ రాథోడ్‌ సస్పెన్షన్‌

Feb 28 2021 @ 00:05AM

అదిలాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకు డు, 2018లో నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన రమేష్‌ రాథోడ్‌ను కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెన్షన్‌ చేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణ క మిటీ చైర్మన్‌ కోదండరెడ్డి శనివారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపా రు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని జిల్లా నాయకుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం రమేష్‌ రాథోడ్‌ను సస్పెన్షన్‌ చేసినట్లు కోదండరెడ్డి ప్రకటించారు. ఈ విషయమై రాథోడ్‌ రమేష్‌ను వివరణ కోరగా.. తనను సస్పెండ్‌ చేసే అధికారం ఎవరికి లేదన్నారు. అసలు తనకు కాంగ్రెస్‌లో సభ్యత్వమే లేదని తెలిపారు. త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీ మునిగిపోవడం ఖాయమని ప్రకటించారు.

Follow Us on:
Advertisement