Rameswaram: ధనుష్కోటి తీరంలో అలల ఉధృతి

ABN , First Publish Date - 2022-10-02T12:43:33+05:30 IST

రామేశ్వరం సమీపం అరిచ్చల్‌మునై, ధనుష్కోటి ప్రాంతాల్లో అలల ఉధ్రుతి అధికంగా ఉండడంతో పర్యాటకులకు నిషేధం విధించారు.

Rameswaram: ధనుష్కోటి తీరంలో అలల ఉధృతి

పెరంబూర్‌(చెన్నై), అక్టోబరు 1: రామేశ్వరం సమీపం అరిచ్చల్‌మునై, ధనుష్కోటి ప్రాంతాల్లో అలల ఉధ్రుతి అధికంగా ఉండడంతో పర్యాటకులకు నిషేధం విధించారు. రామనాథపురం(Rameswaram) జిల్లా ధనుష్కోటి సముద్రతీరం ప్రపంచ పర్యాటక కేంద్రంగా పేరుగాంచింది. శనివారం ఉదయం నుంచి ధనుష్కోటి(Dhanushkoti) తీరంలో అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో ముందస్తు జాగ్రత్తగా అరిచ్చల్‌మునై, ధనుష్కోటి సముద్రతీరాలకు పర్యాటకులు వెళ్లకుండా నిషేధించారు. వారాంతపు రోజులు, విజయదశమి సెలవుల సందర్భంగా భారీగా తరలివచ్చిన పర్యాటకులు సముద్రతీరానికి వెళ్లకుండా నిషేధం విధించడంతో నిరాశ చెందారు.

Updated Date - 2022-10-02T12:43:33+05:30 IST