ఏపీ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దాలి: ఎంపీ రామ్మోహన్ నాయుడు

Published: Sun, 27 Mar 2022 13:22:13 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఏపీ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దాలి: ఎంపీ రామ్మోహన్ నాయుడు

న్యూడిల్లీ: ఆర్టికల్ 360 ఉపయోగించాల్సిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో దాపురించాయని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయంపై కేంద్రం పరిశీలించి అవసరమైతే ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించి ఏపీ ఆర్థిక పరిస్థితిని  సరిదిద్దాలన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఏపీలో విధ్వంసకర పాలన సాగుతోందని, ఆంధ్రప్రదేశ్‌కు భవిష్యత్ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. తాము అనేక సార్లు చెప్పిన విషయాన్ని కాగ్ నివేదిక మరోమారు స్పష్టం చేసిందన్నారు. రూ. 48 వేల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? ఎలా పెట్టారు?  ఏమయ్యాయని?.. ట్రెజరీ కోడ్ ఉల్లంఘించారని కాగ్ పేర్కొందన్నారు.


రాష్ట్రాన్ని జగన్ రెడ్డి సొంత కంపెనీ లాగా  భావిస్తున్నారని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. 48 వేల కోట్ల రూపాయల ఖర్చుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక క్రిమినల్ ముఖ్యమంత్రి అయితే ఎలా దోచుకుంటారో కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారన్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం పాలన సాగిస్తున్నారని, విజన్ అంటూ లేదని, ఒక కంపెనీ కూడా రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేదని, ఎవరైనా ముందుకు వచ్చినా.. వాళ్ల నుంచి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పన్నులు వేసి ప్రజలను పిండి పిండి చేస్తున్నారని, బాత్రూములు, చెత్త సహా ప్రతిదానిపై పన్నులు వేసి ప్రజలను పీక్కుతింటున్నారని రాంమోహన్ నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.