‘భీమ్లా నాయక్’ కోసం రానా షాకింగ్ రెమ్యూనరేషన్

Sep 26 2021 @ 15:57PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలు గా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘భీమ్లా నాయక్’. మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీకిది రీమేక్ వెర్షన్ అన్న సంగతి తెలిసిందే. సితారా ఎంటర్ టైన్మెైంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈసినిమాకి సాగర్ కె చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్ మాటలు, స్ర్కీన్ ప్లే అందించిన ఈ మూవీ లో రానా డేనియల్ శేఖర్ అనే హవాల్దార్ పాత్ర పోషిస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా నుంచి ఆల్రెడీ రెండు టీజర్లు, ఒక సింగిల్ రిలీజ్ అవగా.. వాటికి మంచి స్పందన లభించింది. దాంతో ఈ సినిమా పై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.   

ఇక ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘భీమ్లా నాయక్’ సినిమా కోసం రానా దగ్గుబాటి భారీ పారితోషికం అందుకున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఈ మూవీకోసం రానా 25 రోజులు కాల్షీట్స్ ఇచ్చారని, దాని కోసం ఏకంగా రూ. 4కోట్లు పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది. డేనియల్ శేఖర్ పాత్ర కోసం నిర్మాతలు చాలా మందిని సంప్రదించి.. ఫైనల్ గా రానాని ఫిక్స్ చేశారట.   మరి డేనియల్ శేఖర్ గా రానా ఏ రేంజ్ లో పేరు తెచ్చుకుంటారో చూడాలి. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.