రావణాసురుడికి కరోనా సోకిందట.. నెట్టింట్లో వీడియో వైరల్!

ABN , First Publish Date - 2020-10-25T02:20:13+05:30 IST

కరోనా ఓ మహమ్మారి. దాని కోరల నుంచి ఎవరూ కోలుకోలేరు. ఎంతటి వారైనా దాని బారిన పడితే ప్రాణాలకోసం పోరాడాల్సిందే. ఊపిరందక అల్లాడాల్సిందే. అయితే రావణాసురుడికి..

రావణాసురుడికి కరోనా సోకిందట.. నెట్టింట్లో వీడియో వైరల్!

హర్యానా: కరోనా ఓ మహమ్మారి. దాని కోరల నుంచి ఎవరూ కోలుకోలేరు. ఎంతటి వారైనా దాని బారిన పడితే ప్రాణాలకోసం పోరాడాల్సిందే. ఊపిరందక అల్లాడాల్సిందే. అయితే రావణాసురుడికి కూడా కరోనా సోకితే..? హర్యానాలోని సోనిపట్‌ జిల్లాలో రావణాసురుడికి కరోనా సోకిందట. రావణాసుడు ఆంబులెన్స్‌లో పట్టకపోవడంతో బండిపైన కట్టేసి తీసుకెళ్లారు. ఏం అర్థం కాక తల పట్టుకున్నారా..? అయితే విషయం చెబుతా వినండి. సాధారణంగా ఉత్తర భారతదేశంలో దరసరా సందర్భంగా శరన్నవరాత్రుల్లో చివరి రోజైన విజయ దశమి రోజున రావణాసురుడి విగ్రహ దహనం నిర్వహిస్తారు. అలాంటి ఓ కార్యక్రమం కోసమే రావణుడి విగ్రహాన్ని ఒక చోట నుంచి వేరే చోటుకు తీసుకెళ్లేందుకు ఇలా ఆంబులెన్స్‌పై కట్టి పట్టుకెళ్లారు.


ఈ తతంగాన్నంతా వీడియో తీసిన ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి 'చూశారా..?  రావణాసురుడికి కూడా కరోనా సోకింది. కానీ ఆంబులెన్స్‌లో పట్టకపోవడంతో పైన కట్టేసి తీసుకెళుతున్నారు. కరోనా నుంచి ఎవరూ తప్పించుకోలేరు..' అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

Updated Date - 2020-10-25T02:20:13+05:30 IST