Alia Bhatt నా మొదటి భార్య కాదు.. షాకింగ్ నిజాలు భయటపెట్టిన Ranbir Kapoor

Published: Sun, 26 Jun 2022 10:58:44 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Alia Bhatt నా మొదటి భార్య కాదు.. షాకింగ్ నిజాలు భయటపెట్టిన Ranbir Kapoor

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న యంగ్ హీరోల్లో రణ్‌బీర్ కపూర్ ఒకరు. ఈ యువ నటుడికి ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా అమ్మాయిలు రణ్‌బీర్ అంటే పడి చచ్చిపోతారు. ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్‌ని వివాహం చేసికొని ఈ చాక్లెట్ బోయ్ ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. అయితే.. పెళ్లికి ముందు దీపికా పదుకొనే నుంచి కత్రినా కైఫ్ వరకూ పలువురు స్టార్ హీరోయిన్స్‌లో ప్రేమ వ్యవహారం నడిపిన ఈ కుర్ర నటుడు.. చివరికి అలియా భట్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట పెళ్లి అయిన వెంటనే ఎవరి సినిమా షూటింగ్స్‌లో వారు బిజీ అయిపోయింది.


రణ్‌బీర్ నటించిన తాజా చిత్రాలు ‘షంషేరా (Shamshera)’, ‘బ్రహ్మాస్త్ర’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో షంషేరా జూలై 22న రిలీజ్ కానుంది. విజువల్ వండర్‌గా కరణ్ మల్హోత్రా (Karan Malhotra) తెరకెక్కించారు. రణ్ బీర్ తండ్రి, కొడుకులుగా ద్వి పాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమాలో వాణీ కపూర్ (Vaani Kapoor), సంజయ్ దత్ (Sanjay Dutt) కీలక పాత్రలు పోషించారు. ‘సంజు’ మూవీ  విడుదలైన దాదాపు నాలుగేళ్ల తర్వాత రణ్‌బీర్ నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ని ఇటీవలే విడుదల చేసిన మూవీ టీం జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. ఇందులో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్ తన పెళ్లి గురించి పలు షాకింగ్ నిజాలను భయటపెట్టాడు.


ఆ ఇంటర్వ్యూలో యాంకర్.. ‘మీ అభిమాని మీ కోసం చేసిన ఓ క్రేజీ పని గురించి చెప్పండి’ అని రణ్‌బీర్‌ని అడిగారు. దానికి రణ్‌బీర్ మాట్లాడుతూ.. ‘నా కెరీర్ ప్రారంభమైన రోజుల్లో నేను అమ్మనాన్నలతో కలిసి కృష్ణ రాజ్ బంగ్లాలో ఉండేవాడిని. అక్కడ ఓ అమ్మాయి నన్నుగా భావించి మా ఇంటి గేట్‌ని పెళ్లి చేసుకుంది. ఆ సమయంలో నేను వేరే ప్లేస్ ఉన్నా. ఇంటికి తిరిగి వెళ్లినప్పుడు వాచ్‌మెన్ వచ్చి ఈ విషయం చెప్పాడు. వరమాలతో వచ్చిన ఓ అమ్మాయి, మా ఇంటి గేట్‌కి సింధూరం, పువ్వులు పెట్టి నాతో వివాహం చేసుకుందని చెప్పాడు. అయితే.. నా మొదటి భార్యను నేను ఇంతవరకు కలవలేదు’ అని నవ్వుతూ చెప్పాడు. దీంతో రణ్‌బీర్ మొదటి భార్య అలియా కాదని, ఈ విషయం తెలిస్తే తన రియాక్షన్ ఎలా ఉంటుందోనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా.. ఇటీవలే విడుదలైన షంషేరా ట్రైలర్‌ మంచి రెస్పాన్స్‌ని అందుకుంది. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...