నా ప్రమాణ స్వీకారోత్సవానికి పసుపు తలపాగాలు ధరించి రండి

Published: Mon, 14 Mar 2022 12:39:12 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నా ప్రమాణ స్వీకారోత్సవానికి పసుపు తలపాగాలు ధరించి రండి

కాబోయే సీఎం భగవంత్ మాన్ ట్వీట్

చండీఘడ్ (పంజాబ్): తన ప్రమాణస్వీకారోత్సవానికి పసుపురంగు తలపాగాలు ధరించి రావాలని పంజాబ్ రాష్ట్రానికి కాబోయే సీఎం భగవంత్ మాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్ కలాన్ గ్రామంలో మార్చి 16న పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ  సందర్భంగా రంగ్ దే బసంతి థీమ్‌తో ఖట్కర్ కలాన్ గ్రామం కళకళలాడనుంది. ‘‘ప్రజలు మార్చి 16న నా ప్రమాణ స్వీకారోత్సవం కోసం ఖట్కర్ కలాన్‌కు చేరుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. ఆ రోజు మా సోదరులు పసుపురంగు తలపాగాలు ధరించాలని నా మనవి. సోదరీమణులు పసుపు శాలువాలు/స్టోల్‌లు ధరించాలని నేను అభ్యర్థిస్తున్నాను. మేం ఖతర్ కలాన్‌కు బసంత్ రంగులు వేస్తాం’’ అని భగవంత్ మాన్ ట్వీట్‌లో కోరారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.