ఓటీటీలో 'రంగ్ దే'

May 29 2021 @ 15:16PM

యూత్‌స్టార్ నితిన్ - కీర్తి సురేష్ జంటగా నటించిన 'రంగ్ దే' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోస్టర్స్, టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్‌తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడాయి. నితిన్ - కీర్తి జోడీ బాగుందనే టాక్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. రిలీజయ్యాక హిట్ టాక్ వచ్చింది కాని, కరోనా కారణంగా ఆశించినంతగా వసూళ్ళు రాబట్టలేకపోయింది. కాగా ఈ సినిమాని జూన్ 12 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌కి రెడీ అయింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'రంగ్ దే' ఓటీటీలో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూడాలి. ప్రస్తుతం నితిన్ 'మాస్ట్రో' సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన 'అంధాదున్‌'కి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఇందులో నభా నటేష్ హీరోయిన్‌గా తమన్నా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.