సెట్స్‌పైకి 'రంగ మార్తాండ'..

Sep 28 2021 @ 12:36PM

ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'రంగమార్తాండ'. ఈ సినిమాను తాజాగా తిరిగి సెట్స్‌పైకి తీసుకు వచ్చారు. వాస్తవంగా ఈ పాటికే రిలీజ్ కావాల్సిన 'రంగమార్తాండ' చిత్రీకరణ మొదలైనప్పటి నుంచి కరోనా వేవ్స్‌తో పాటు ఇతర కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఆమధ్య ఈ సినిమా ఇక అటకెక్కినట్టే అని కూడా మాట్లాడుకున్నారు. అందుకు కారణం ఈ సినిమా షూటింగ్‌ మొదలై రెండేళ్లు గడిచినప్పటికీ ఇంకా చిత్రీకరణ పూర్తి కాకపోవడమే. మధ్యలో చిత్ర నిర్మాత తప్పుకున్నారని వార్తలు వచ్చాయి.

అయితే ఈ సినిమాపై వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ దర్శకుడు కృష్ణవంశీ ఓ ట్వీట్‌తో మూవీకి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. 'రంగమార్తాండ' సినిమా షూటింగ్‌ మళ్లీ మొదలైంది.. అంటూ షూటింగ్‌ స్పాట్‌కు సంబంధించిన ఓ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఇక ఈ ఫొటో చూస్తుంటే శివాత్మికకు సంబంధించి షూటింగ్ జరుగుతున్నట్లు కనిపిస్తోంది. కాగా గత కొన్నిరోజులుగా ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై మేకర్స్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఈ మూవీ తర్వాత 'అన్నం' అనే మరో సినిమాను చేయనున్నట్టు ఇది వరకే కృష్ణవంశీ ప్రకటించారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.