Rangamarthanda : టైటిల్ లోగో రివీల్‌కు వినూత్న ప్రయోగం

Published: Tue, 05 Jul 2022 19:02:17 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Rangamarthanda : టైటిల్ లోగో రివీల్‌కు వినూత్న ప్రయోగం

క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamshy) తాజా చిత్రం ‘రంగమార్తాండ’ (Rangamarthanda). మరాఠీ సూపర్‌హిట్ ‘నటసమ్రాట్’ (Natasamrat) చిత్రానికిది అఫీషియల్ రీమేక్. నానా పాటేకర్ (Nanapatekar) పోషించిన ప్రధాన పాత్రను తెలుగులో ప్రకాశ్ రాజ్ (Prakashraj) చేస్తున్న సంగతి తెలిసిందే. రమ్యకృష్ణ (Ramyakrishna), రాజశేఖర్ (Rajasekhar) తనయ శివాత్మిక (Shivatmika), అనసూయ (Anasuya) ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తుండగా..కామెడీ కింగ్ బ్రహ్మానందం (Brahmanandam) తన కెరీర్‌లో ఇదివరకెన్నడు చేయని ఒక ఎమోషనల్ కేరక్టర్‌కు జీవం పోస్తున్నారని తెలుస్తోంది. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను ఆగస్ట్ లో విడుదల చేయబోతున్నట్టు సమాచారం. మాస్ట్రో ఇళయరాజా (Ilayaraja) సంగీతం, నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోయనున్నాయి. ఇటీవల ఇళయరాజా సారధ్యంలో జరిగిన మ్యూజిక్ సెషన్స్‌ను కృష్ణ వంశీ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. దానికి విపరీతమైన స్పందన లభించింది. ఇక ఈ సినిమా టైటిల్ లోగో వెల్లడికి సమయం ఆసన్నమైంది. 

‘రంగమార్తాండ’ టైటిల్ లోగో ను రివీల్ చేయడానికి దర్శకుడు కృష్ణవంశీ ఒక వినూత్న ప్రయోగం చేస్తున్నారు. అదేంటంటే.. నాలుగు రోజుల పాటు ప్రీరోల్ (Pre roll) పేరుతో వీడియోల్ని విడుదల చేస్తున్నారు. యూట్యూబ్ లో వచ్చే ఈ వీడియోస్ లో నాలుగో రోజు టైటిల్ రివీల్ అయ్యేలా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఈ రోజు (జూలై 05) ఒక వీడియోను విడుదల చేశారు. అందులో కృష్ణవంశీ ఇప్పటివరకు డైరెక్ట్ చేసిన సినిమాల సమాచారంతో పాటు అందులోని డైలాగ్స్ ను ప్లే చేశారు. ఆయన కెరీర్ లో 21వ చిత్రంగా ‘రంగమార్తాండ’ విశేషాన్ని సంతరించుకుంది. ఈ విషయాన్ని కృష్ణవంశీ సోషల్ మీడియాలో తెలుపుతూ.. ఆ వీడియో లింక్ ను షేర్ చేశారు. 

2017లో విడుదలైన ‘నక్షత్రం’ (Nakshtram) కృష్ణవంశీ నుంచి ఆఖరుగా వచ్చిన చిత్రం. ఈ సినిమా పరాజయం పాలైంది. దాంతో  దాదాపు ఐదేళ్ళు గ్యాప్ తీసుకొని ఈ సారి ఎలాగైనా ప్రేక్షకుల హృదయాల్ని టచ్ చేసేలా ఒక సినిమా తీయాలనే పట్టుదలతో ‘రంగమార్తాండ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అయితే కృష్ణవంశీ మళ్ళీ దర్శకుడిగా రీఛార్జ్ అవుతారు. మరిన్ని అద్బుత చిత్రాలు చేయడానికి ఆయనకి వీలు దొరకుతుంది. సో.. రంగమార్తాండ చిత్రం సూపర్ హిట్ అవ్వాలని ఆశిద్దాం. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International