ఫిబ్రవరి నెలలో Ranji Trophy టోర్నమెంట్

ABN , First Publish Date - 2022-01-28T13:28:40+05:30 IST

కొవిడ్ మహమ్మారి వల్ల పలు సార్లు వాయిదా పడి రంజీట్రోఫీ లీగ్ పోటీలను ఫిబ్రవరి 15వతేదీ తర్వాత నిర్వహించనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)...

ఫిబ్రవరి నెలలో Ranji Trophy టోర్నమెంట్

బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ వెల్లడి

న్యూఢిల్లీ: కొవిడ్ మహమ్మారి వల్ల పలు సార్లు వాయిదా పడి రంజీట్రోఫీ లీగ్ పోటీలను ఫిబ్రవరి 15వతేదీ తర్వాత నిర్వహించనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కోశాధికారి అరుణ్ ధుమాల్ వెల్లడించారు. ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందు ఈ సీజనులో రంజీ ట్రోఫీని నిర్వహించేందుకు బీసీసీఐ ఆసక్తిగా ఉందని అరుణ్ చెప్పారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆటగాళ్ల భద్రత విషయంలో తాము రాజీపడకుండా టోర్నీని నిర్వహిస్తామని చెప్పారు.టోర్నమెంట్‌ను రెండు భాగాలుగా నిర్వహించాలని బోర్డు భావిస్తోందని ఆయన చెప్పారు. 




ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ముందు ఫిబ్రవరి-మార్చిలో లీగ్ దశ, ఐపీఎల్ తర్వాత నాకౌట్‌లు నిర్వహిస్తామని అరుణ్ పేర్కొన్నారు.రంజీ ట్రోఫీ రోడ్‌మ్యాప్‌ను చర్చించడానికి బీసీసీఐ అధికారుల మధ్య జరిగిన సమావేశం తరువాత అరుణ్ ధుమాల్ మీడియాతో మాట్లాడారు.


Updated Date - 2022-01-28T13:28:40+05:30 IST