నరసింహను అభినందిస్తున్న రాజారెడ్డి తదితరులు
తిరుపతి(విద్య), మే 16: వరల్డ్ సైంటిస్ట్ అండ్ యూనివర్సిటీ 2022కి ప్రకటించిన ర్యాంకింగ్‌లో ఎస్వీయూ వైరాలజీ విభాగ అధ్యాపకుడు డాక్టర్ జి.నరసింహకి ఆలిండియా స్థాయిలో 96వ ర్యాంకు లభించింది. బయలాజికల్ సైన్స్ విభాగంలో అప్లైడ్ మైక్రో బయాలజీ, వైరాలజీ రంగాల్లో చేసిన పరిశోధనలకు గుర్తింపుగా ఈ ర్యాంకు ప్రకటించారు. కాగా.. ఎస్వీయూ పరిధిలో తొలిర్యాంకు, ఆసియాలో 649వ ర్యాంకు, వరల్డ్‌లో 5321వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. ఈయన్ను వీసీ రాజారెడ్డి, రెక్టార్ శ్రీకాంత్‌రెడ్డి, రిజిస్ర్టార్ మహ్మద్ హుస్సేన్ తదితరులు అభినందించారు.