రణ్‌వీర్‌- అలియా ప్రేమకథ

Jun 4 2021 @ 01:20AM

ఓ వైపు సినిమాల చిత్రీకరణ, విడుదలకు కరోనా బ్రేక్‌ వేసినా బాలీవుడ్‌లో కొత్త సినిమాల నిర్మాణంపై కసరత్తులు కొనసాగుతున్నాయి. రణ్‌వీర్‌సింగ్‌, అలియాభట్‌ జంటగా త్వరలో ఓ చిత్రం తెరకెక్కనున్నట్టు బాలీవుడ్‌ సమాచారం. స్వీయ దర్శకత్వంలో  కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘ప్రేమ్‌ కహానీ’ అనే పేరు పరిశీలనలో ఉంది. సున్నితమైన హాస్య ప్రేమకథ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. భిన్న ధ్రువాల లాంటి  యువతీ యువకులుగా అలియా, రణ్‌వీర్‌ కనిపించనున్నారు. వారు ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించడంతో కరణ్‌ జోహార్‌ కథపై వర్క్‌ చేయడం ప్రారంభించారు. ‘యే దిల్‌ హై ముష్కిల్‌’ చిత్రం వచ్చిన నాలుగేళ్ల విరామం తర్వాత కరణ్‌ జోహార్‌ మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.