Deepika Padukone నా కంటే తెలివైనది.. ఆమె సలహాలు కచ్చితంగా తీసుకుంటా: Ranveer Singh

Published: Fri, 08 Oct 2021 16:19:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Deepika Padukone నా కంటే తెలివైనది.. ఆమె సలహాలు కచ్చితంగా తీసుకుంటా: Ranveer Singh

బాలీవుడ్‌ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగుతోంది. వివాహం తర్వాత కూడా ఇద్దరూ తమ తమ కెరీర్లపైనే దృష్టి సారించి వరుస ఆఫర్లు అందుకుంటున్నారు. వెండితెర మీద దూసుకుపోతున్న రణ్‌వీర్ త్వరలో బుల్లితెర మీద కూడా సందడి చేయబోతున్నాడు. `ది బిగ్ పిక్చర్` పేరుతో రూపొందుతున్న ఓ క్విజ్ ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. టీవీ తెరపై రణ్‌వీర్‌కు ఇదే తొలి కార్యక్రమం. ఆ కార్యక్రమం గురించి మాట్లాడేందుకు రణ్‌వీర్ తాజాగా మీడియా ముందుకు వచ్చాడు. 


ఈ సందర్భంగా దీపిక సలహాల గురించిన ప్రశ్న ఎదురైంది. దానికి రణ్‌వీర్ స్పందిస్తూ.. `దీపిక లాంటి సృజనాత్మకత కలిగిన వ్యక్తి భార్యగా దొరకడం నిజంగా నా అదృష్టం అనే చెప్పాలి. కళలు, క్రీడలు మొదలైన అన్ని రంగాలపై ఆమెకు నా కంటే మంచి అవగాహన ఉంది. ఇలాంటి క్విజ్‌ల గురించి కూడా ఆమె కొన్ని సలహాలు ఇస్తుంటుంది. ఆమె నుంచి సలహాలు స్వీకరించి వాటిపై నేను కసరత్తు చేస్తుంటా. ఆమె ప్రేమ, మద్దతుతో బుల్లితెర మీద కూడా నేను విజయవంతమవుతాన`ని రణ్‌వీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...