అత్యాచారం కేసులో వ్యక్తి అరెస్టు

ABN , First Publish Date - 2020-12-03T05:52:04+05:30 IST

యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని బుధవారం అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు. ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకకు చెందిన ఓ యువతికి సెప్టెంబరు 9న కె.పెదపూడికి చెందిన బీర సురేష్‌తో పెళ్లి కుదిరింది.

అత్యాచారం కేసులో వ్యక్తి అరెస్టు

ఆత్రేయపురం, డిసెంబరు 2: యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని బుధవారం అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు. ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకకు చెందిన ఓ యువతికి సెప్టెంబరు 9న కె.పెదపూడికి చెందిన బీర సురేష్‌తో పెళ్లి కుదిరింది. ఈ నేపఽథ్యంలో ఆ యువతితో సురేష్‌ అవసరాలు తీర్చుకుని పెళ్లికి నిరాకరించాడు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం సురేష్‌ను అరెస్టు చేసి కొత్తపేట కోర్టులో హాజరుపరిచారు. కాగా పెళ్లి చెడగొట్టిన మరో నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని, వారిని కూడా అరెస్టు చే యాల్సి ఉందని ఎస్‌ఐ చెప్పారు.

Updated Date - 2020-12-03T05:52:04+05:30 IST