హార్దిక్ పాండ్యాపై దావూద్ ఇబ్రహీం సహాయకుడి భార్య రేప్ కేసు

ABN , First Publish Date - 2021-11-13T01:47:05+05:30 IST

అయితే తన ఫిర్యాదును ఏ పోలీసూ తీసుకోలేదని ఆమె వాపోయింది. నెలల తరబడి అనేక మంది పోలీసుల వద్దకు తిరిగినానని చాలా మంది తన నుంచి డబ్బు అడిగినట్లు రెహ్ముమా తెలిపారు. వారికిచ్చేందుక తన దగ్గర డబ్బు లేదని, అయినా ఫిర్యాదు..

హార్దిక్ పాండ్యాపై దావూద్ ఇబ్రహీం సహాయకుడి భార్య రేప్ కేసు

ముంబై: ఇండియన్ క్రికెట్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై అత్యాచార కేసు నమోదైంది. కేసు వేసింది మామూలు వ్యక్తి కాదు. అండర్ వల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సహాయకుడి భార్య రెహ్ముమా భాటి అనే మహిళ. వ్యాపారం కోసం తన భర్త సెలెబ్రిటీలతో బలవంతంగా పడుపు వృత్తి చేయించేవాడని.. అలా హార్దిక్ పాండ్యా సహా మాజీ ఫేసర్ మునాఫ్ పటేల్, బీసీసీఐ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా పృథ్వీరాజ్ కొటారీ వంటి వారు కూడా తనపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రెహ్ముమా పేర్కొన్నారు.


అయితే తన ఫిర్యాదును ఏ పోలీసూ తీసుకోలేదని ఆమె వాపోయింది. నెలల తరబడి అనేక మంది పోలీసుల వద్దకు తిరిగినానని చాలా మంది తన నుంచి డబ్బు అడిగినట్లు రెహ్ముమా తెలిపారు. వారికిచ్చేందుక తన దగ్గర డబ్బు లేదని, అయినా ఫిర్యాదు చేయడానికి తానెందుక లంచం ఇవ్వాలని ఆమె ప్రశ్నించారు. తనవైపు న్యాయం ఉందని, మిగిలిన వారంతా క్రిమినల్స్ అని ఆమె చెప్పారు. కాగా, రెహ్ముమా ఫిర్యాదు అంశాన్ని ముంబై డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ మంజునాథ్ సింగే ధ్రువీకరించారు.  అయితే ఆమె వద్ద జరిగిన సంఘటన గురించి కానీ, ఫిర్యాదులో పేర్కొన్న వారి గురించి పెద్దగా సమాచారం తెలియదని చెప్పినట్టు ఆయన తెలిపారు.

Updated Date - 2021-11-13T01:47:05+05:30 IST