అత్యాచారం కేసులో సవితి తండ్రికి 20 ఏళ్ల జైలు శిక్ష

Published: Wed, 22 Jun 2022 10:47:56 ISTfb-iconwhatsapp-icontwitter-icon

హైదరాబాద్/బర్కత్‌ పుర: కూతురిపై అత్యాచారానికి పాల్పడిన సవితి తండ్రికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పదో అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కవిత మంగళవారం తీర్పునిచ్చారు. కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ హబీబుల్లా ఖాన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ మంత్రాలయంకు చెందిన ఓ వివాహిత తన భర్త చనిపోవడంతో మహ్మద్‌ జహంగీర్‌(35)ను రెండో పెళ్లి చేసుకుంది. ఆ వివాహితకు 13 ఏళ్ల వయస్సు గల కూతురు ఉంది. ఉపాధి కోసం నగరానికి వచ్చి బర్కత్‌పురలోని ఓ అపార్ట్‌మెంట్‌లో జహంగీర్‌ వాచ్‌మన్‌గా పనిచేశాడు. భార్య ఇళ్లలో పాచి పని చేయడానికి ప్రతి రోజూ ఉదయమే వెళ్లిపోయేది. ఈ క్రమంలో జహంగీర్‌ తన సవితి కూతురుపై మూడు నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంబర్‌పేటలో నివాసముండే అతడి తమ్ముడు మహ్మద్‌ భాష(32) బాలికను తన గదికి తీసుకువెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు.


ఈ విషయమై 2017లో బాధిత బాలిక తాను చదివే పాఠశాలలో ఉపాధ్యాయురాలికి తనపై జరిగిన అత్యాచారాన్ని చెప్పింది. వెంటనే స్పందించిన ఆ ఉపాధ్యాయురాలు బాలికను వెంట తీసుకొని కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. నాడు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై మంగళవారం కోర్టు తీర్పునిచ్చింది. పదో అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కవిత సవితి తండ్రి మహ్మద్‌  జహంగీర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష, ఐదు వేల రూపాయల జరిమానా, అతడి సోదరుడు మహ్మద్‌ భాషాకు 3 ఏళ్ల జైలు శిక్ష, ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.