ఖమ్మం క్రైం మార్చి25: ఉపాధ్యాయురాలుపై అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడు బాణో త్ కిషోర్‌ను శుక్రవారం ఖానాపురంహవేలి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరి చారు. గార్ల మండలంలో ఎస్జీటీ టీచర్‌గా పనిచేస్తున్న బాణోత్ కిషోర్ ఈ నెల17న అదే మండలంలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలిని ఖమ్మం నగరంలో దింపుతానని తన కారులో ఎక్కించుకున్నాడు. పాండురంగాపురం వద్దకు రాగానే తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై ఈనెల 22న బాధితురాలు ఫిర్యాదు చేయగా పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. దీంతో కిషోర్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. దీంతో అతడిని జిల్లా జైలుకు తరలించి అతడి కారును, రెండు సెల్ఫోన్లు సీజ్ చేసినట్లు ఖానాపురం హవేలి పోలీసులు తెలిపారు.