Bengaluru: మైనర్ బాలికలపై లైంగిక దాడి కేసులో లింగాయత్ మఠాధిపతి అరెస్టు

ABN , First Publish Date - 2022-08-29T20:51:03+05:30 IST

కర్ణాటకలో మైనర్ బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన ఆరోపణలపై చిత్రదుర్గలోని...

Bengaluru: మైనర్ బాలికలపై లైంగిక దాడి కేసులో లింగాయత్ మఠాధిపతి అరెస్టు

బెంగళూరు: కర్ణాటకలో మైనర్ బాలికలపై లైంగిక దాడులకు (Sexual assault) పాల్పడిన ఆరోపణలపై చిత్రదుర్గలోని లింగాయత్ మఠాధిపతి (Lingayat Mutt sheer) శివమూర్తి మురుఘా శరణును (Shivamurthy Murugha Sharanaru)  పోలీసులు సోమవారంనాడు నిర్బంధంలోకి (Detained) తీసుకున్నారు. మఠానికి అనుబంధంగా ఉండే హైస్కూలులో చదువుకుంటున్న బాలికలపై అత్యాచార ఆరోపణలకు కింద హవేరి జిల్లాల ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఇద్దరు మైనర్ బాలికలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ (POCSO) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. మఠం నిర్వహణలోని పాఠశాల వార్డెన్ సహా నలుగురిపై కూడా కేసులు నమోదయ్యాయి.


మురుగ మఠం ఆధ్వర్యంలోని హాస్టల్‌లో ఉంటున్న 15, 16 ఏళ్ల మైనర్ బాలికలు ఇద్దరు లైంగిక దాడుల విషయాన్ని జిల్లా సంక్షేమ కమిటీ దృష్టికి తెచ్చారు. అదే ఫిర్యాదును పోలీస్ స్టేషన్‌కు సమర్పించారు. మూడున్నరేళ్లుగా తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ బాలికలిద్దరూ ఆరోపణలు చేశారు. కాగా, ఇది కేవలం ఈ ఇద్దరు అమ్మాయిలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదని, సంస్థలో చదువుతున్న పలువురు అమ్మాయిలను కూడా శివమూర్తి వేధిస్తున్నట్టు ఎన్‌జీవో సంస్థ ఒడనడి సేవా సంస్థ అధిపతి స్టాన్లీ ఆరోపించారు. ఇది చాలా కాలంగా జరుగుతోందని, భయం కారణంగానే విద్యార్థులు ఇంతవరకూ బయటకు చెప్పలేదని అన్నారు. ఎలాంటి బెదరింపులు వచ్చినా తాము వెనుకాడేది లేదని, పిల్లల హక్కుల పరిరక్షణ తమ సొసైటీ బాధ్యతని తెలిపారు.


కర్ణాటక ప్రభుత్వం ఏమంటోంది?

కాగా, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారని, విచారణ పూర్తయితే నిజాలు బయటకు వస్తాయని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. చిత్రదుర్గలో పోస్కో, కిడ్నాప్ కేసులు నమోదయ్యాయని, పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నందున దానిపై ఇప్పుడే మాట్లడటం సరికాదని అన్నారు.


ఆరోపణలు విచారకరం: ఈశ్వరప్ప

కాగా, లింగాయత్ షీర్‌పై ఆరోపణలు రావడం విచారకరమని, ఈ వార్త నిజం కాకూడదని తాను కోరుకుంటున్నానని బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప అన్నారు. రాష్ట్రంలో చిత్రదుర్గ మఠం చాలా పేరున్న మఠమని, విచారణ పూర్తయితేనే విషయం ఏమిటనేది తెలుస్తుందని, దీనికి ముందే ఊహాగానాలు చేయలేమని అన్నారు. విచారణలో ఏది తేలినా తాము అంగీకరించేందుకు సిద్ధమని చెప్పారు.

Updated Date - 2022-08-29T20:51:03+05:30 IST