27 ఏళ్ల నాటి దారుణం.. ‘నా తండ్రి ఎవరు..’ అని కొడుకు ప్రశ్నించడంతో ఆమె..

ABN , First Publish Date - 2021-03-07T00:47:14+05:30 IST

ఎప్పుడో 27 ఏళ్ల క్రితం ఆ మహిళ జీవితంలో జరిగిన దారుణం ఇది! అప్పుడు ఆమెకు పన్నెండేళ్లు!

27 ఏళ్ల నాటి దారుణం.. ‘నా తండ్రి ఎవరు..’ అని కొడుకు ప్రశ్నించడంతో ఆమె..

షాజహాన్‌పూర్: ఎప్పుడో 27 ఏళ్ల క్రితం ఆ మహిళ జీవితంలో జరిగిన దారుణం ఇది! అప్పుడు ఆమెకు పన్నెండేళ్లు! తన అక్కాబావలతో కలసిని ఉత్తరప్రదేశ్‌లో నివసించేది. ఈ క్రమంలో ఆమెపై ఓ మృగాడు కన్నేశాడు! తన సోదరుడితో కలసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘోరం కారణంగా..ఆమె 13 ఏళ్లకే గర్భవతి అయింది. మరొకరికి ఈ బిడ్డను పెంపానికి ఇచ్చేసింది. ఈలోపు కాలం ఆమె జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చింది. ఇటీవల ఆ కొడుకు పెద్దవాడై తల్లిని వెత్తుకుంటూ వచ్చాడు. నా తండ్రి ఎవరు అని ప్రశ్నించాడు. దీంతో పాత గాయం మళ్లీ రేగింది. న్యాయం జరిగితే తప్ప మనసుకు స్వాంతన లభించదనుకుందో ఏమో ఆమె ఇటీవలే పోలీసులను ఆశ్రయించింది. ఉత్తరప్రదేశ్ షాజహాన్ పూర్‌లో ఇటీవల వెలుగు చూసిన ఘటన ఇది!


ఎస్పీ సంజయ్ కుమార్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు ఒంటరిగా ఉండటంతో చూసి నిందితుడు నాకీర్ హసన్, అతడి సోదరు గుడ్డూ ఆమెను బలాత్కరించారు. ఆ తరువాత కూడా పలు మార్లు ఆమెను బలాత్కరించారు. దీంతో గర్భం దాల్చిన ఆమె 1994 ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తరువాత బంధువుల సూచనమేరకు ఆ బిడ్డను పెంపకానికి ఇచ్చింది. ఆ తరువాత..బావకు ట్రాన్సఫర్ అవడంతో ఆమె ఉదంపూర్‌కు వెళ్లిపోయింది. అక్కడ ఉండగానే ఆమెకు వివాహమైంది. కానీ..పెళ్లైన 10 ఏళ్ల తరువాత అత్యాచారం విషయం భర్తకు తెలియడంతో అతడు ఆమెను విడిచిపెట్టాశాడు. దీంతో ఆమె మళ్లీ ఉదంపూర్‌కు చేరుకుని అక్కడే నివశించసాగింది. 


ఈ క్రమంలో ఆ బిడ్డ పెద్దవాడై.. తల్లిని వెత్తుకుంటూ ఆమె దగ్గరకు వచ్చాడు. తన తండ్రి ఎవరు అని ప్రశ్నించాడు. దీంతో.. నాటి గాయం మళ్లీ రేగడంతో ఆమె న్యాయం కోసం పోరాటం ప్రారంభించింది. నిందితులపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఆమె ఫిర్యాదును స్వీకరించేందుకు తొలుతు వారు నిరాకరిండంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తీర్పు ఆమెకు అనుకూలంగా రావడంతో పోలీసులు ఇటీవలే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ శనివారం నాడు మీడియా సమావేశంలో తెలిపారు. 

Updated Date - 2021-03-07T00:47:14+05:30 IST