శరవేగంగా డయోగ్నోస్టిక్‌ కేంద్రం భవన నిర్మాణం

ABN , First Publish Date - 2022-09-26T05:21:16+05:30 IST

జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేస్తున్న టీ-హబ్‌ డయోగ్నోస్టిక్‌ సెంటర్‌ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

శరవేగంగా డయోగ్నోస్టిక్‌ కేంద్రం భవన నిర్మాణం
పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న టీ-హబ్‌ డయోగ్నోస్టిక్‌ సెంటర్‌

- ఉచితంగా 57 రకాల రక్త, మూత్ర పరీక్షలు

- భవనానికి రూ. 1.05 కోట్లు, పరికరాలకు రూ.50 లక్షలు మంజూరు

- నాలుగు మాసాల తర్వాత అందుబాటులోకి వచ్చే అవకాశం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేస్తున్న టీ-హబ్‌  డయోగ్నోస్టిక్‌ సెంటర్‌ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రక్త, మూత్ర పరీక్షల పేరిట పేద, మధ్య తరగతి ప్రజల జేబులు గుల్ల కాకుండా ఉండేందుకు ప్రభుత్వమే 57 రకాల పరీక్షలను ఉచితంగా చేయనున్నది. ఈ భవనం పూర్త యితే జిల్లా ప్రజలకు ఉచిత సేవలు అందు బాటులోకి రానున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దవాఖానాకు వెళ్లినా తప్పనిసరిగా రక్త, మూత్ర పరీక్షలు చేస్తుంటారు. ఈ పరీక్షలు అనేక రకాలు ఉంటాయి. జ్వరం వచ్చిందని ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళితే మాత్రం తప్పనిసరిగా సీబీపీ, వైడల్‌, మలే రియా, యూరిన్‌ అనాలసిస్‌ తదితర పరీక్షలను చేస్తారు. వీటికి వెయ్యి రూపాయలకు తగ్గకుండా ఖర్చు అవుతుం టాయి. ఇలా వందలకు వందలు, వేలకు వేల రూపాయలు ఖర్చు చేసి అప్పులపాలు గాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాల్లో టీ-హబ్‌ డయోగ్నోస్టిక్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తు న్నది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం 2018 జూన్‌లో శ్రీకారం చుట్టింది. అన్ని సౌకర్యాలతో ఆయా పరీక్ష లు నిర్వహించే నిపుణులతో కూడిన సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. ఈ కేంద్రాలకు వివిధ ఆసుపత్రుల నుంచి వచ్చే శాంపిళ్లను వెంటవెంటనే పరీక్షించి రిపోర్టులను ఆయా ఆసుపత్రులకు పం పించడంతో పాటు రోగి మొబైల్‌ నంబర్‌కు కూడా మెస్సేజ్‌ పంపిస్తున్నారు. తద్వారా ఇచ్చే లింక్‌ను ఓపెన్‌ చేస్తే మొత్తం రిపోర్టు ఓపెన్‌ అవుతుంది. ఈ కేంద్రాల ద్వారా 57రకాల రక్త, మూత్ర పరీక్షలు నిర్వహిస్తారు. రక్త పరీక్షల్లో సీబీపీ, మలేరియా, డెంగ్యూ, చికున్‌ గున్యా, వైడల్‌, రక్తనమూనా టెస్టు, షుగర్‌ పరీక్షలు, కొలెస్ట్రాల్‌, ఎల్‌డీఎల్‌, హెచ్‌డీఎల్‌, హెచ్‌బీఏ1సీ, హిమోగ్లోబిన్‌, అన్ని రకాల రక్త పరీక్ష లతో పాటు మూత్ర పరీక్షలను కూడా చేయను న్నారు. ఈ పరీక్షలను జిల్లాలో ఉన్నటువంటి ప్రజ లందరూ సద్వినియోగం చేసుకోవచ్చు. 

డిసెంబరు వరకు పనులు పూర్తి..

సబ్‌సెంటర్లు, గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లు, పట్టణ ఆరోగ్య కేంద్రాలకు వివిధ వ్యాధులతో బాధపడుతూ ఓపీ సేవల కోసం వచ్చే రోగులకు రక్త, మూత్ర పరీక్షలు అవసరం పడితే అక్కడ ఉం డే సిబ్బంది నమూనాలు తీసి టి-హబ్‌ కేంద్రానికి పంపించనున్నారు. మరుసటి రోజే రిపోర్టులు సంబంధిత కేంద్రానికి అందనున్నాయి. అలాగే ఎవ రైతే రోగులు పరీక్షలు చేయించుకుంటారో వారి వ్యక్తిగత సెల్‌ నంబర్లకు కూడా మెస్సేజ్‌లు వస్తా యి. ఎక్స్‌రే, ఆల్ర్టా సౌండ్‌ స్కానింగ్‌, సీటీ స్కాన్‌, తదితర పరీక్షలు నిర్వహించేందుకు భవిష్యత్తులో కార్యాచరణ చేయనున్నారు. టీ-హబ్‌ కేంద్రాలను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లా కేంద్రంలో నూత నంగా నిర్మించిన 100 పడకల మాతాశిశు సంరక్షణ కేంద్రం ప్రారంభో త్సవానికి వచ్చిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావును జిల్లాకు ఒక డయోగ్నోస్టిక్‌ సెంటర్‌ను మంజూరు చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌లు కోరారు. ఆ వెంటనే డయోగ్నో స్టిక్‌ సెంటర్‌ను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో టీ-హబ్‌ డయోగ్నోస్టిక్‌ సెంటర్‌ భవనా న్ని నిర్మించాలని నిర్ణయించారు. రెండంతస్తుల్లో నిర్మించే భవనానికి ఒక కోటి 5 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఈ మేరకు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ల్యాబ్‌లో కావాల్సిన పరికరాల కొనుగోలు కోసం 50 లక్షల రూపాయలకు పైగా మంజూరయ్యాయి. రెండు మాసాల క్రితం పనులు ప్రారంభం కాగా, డిసెంబర్‌ నెలాఖరు వరకు భవన నిర్మాణ పనులను పూర్తి చేస్తామని డీఈ రాజిరెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-09-26T05:21:16+05:30 IST