కర్ణాటకలో ‘బగీరా’.. వైరల్ అవుతున్న ఫోటోలు

ABN , First Publish Date - 2020-07-06T22:27:08+05:30 IST

మనుషుల కంటికి నల్లచిరుతలు కనిపించడం చాలా అరుదు. అలాంటిది కర్ణాటకలోని అడవుల్లో ఓ నల్లచిరుత...

కర్ణాటకలో ‘బగీరా’.. వైరల్ అవుతున్న ఫోటోలు

బెంగళూరు: మనుషుల కంటికి నల్లచిరుతలు కనిపించడం చాలా అరుదు. అలాంటిది కర్ణాటకలోని అడవుల్లో ఓ నల్లచిరుత సంచరిస్తోందన్న వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ షాజ్ జంగ్ ఈ చిరుతకు సంబంధించిన ఫోటోలను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కబినీ అటవీ ప్రాంతంలో ఈ చిరుతను తాను చూసినట్లు ఆయన తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. అయితే ఈ ఫోటోలు నెటిజన్లను తెగ ఆకర్షిస్తున్నాయి. దాదాపు 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకున్నాయి. ఈ ఫోటోలను చూసిన ప్రతి ఒక్కరూ జంగిల్ బుక్ కామిక్‌లోని బగీరా ఇదేనంటూ చమత్కరిస్తున్నారు. జంగిల్ బుక్‌లో మాదిరిగా భారత్‌లో  నిజంగా బగీరా కనిపించిందని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. మరొకరైతే జీవితంలో ఒక్కసారైనా ఇలాంటివి చూడాలని, ప్రకృతిని ఆస్వాదించాలని అభిప్రాయపడ్డాడు.

Updated Date - 2020-07-06T22:27:08+05:30 IST