100ఏళ్ల తర్వాత మళ్లీ ఇపుడే కనిపించిన అరుదైన లిప్‌స్టిక్‌ మొక్క

ABN , First Publish Date - 2022-06-07T01:36:00+05:30 IST

మన దేశంలో అత్యంత అరుదైన లిప్‌స్టిక్‌ మొక్కను గుర్తించారు శాస్త్రవేత్తలు. లిప్‌స్టిక్‌ మొక్క శాస్త్రీయ నామం ఏస్కీనాంథస్‌ మానటే రియా డ్యూన్‌. ఈ మొక్కను బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా శాస్త్రవేత్తలు అరుణాచల్‌ప్రదేశ్‌లో కనుగొన్నారు. లిప్‌స్టిక్‌ ప్లాంట్‌ను మొదటిసారిగా అరుణాచల్‌ప్రదేశ్‌లో 1912 సంవత్సరంలో బ్రిటీష్ సైంటిస్ట్‌ స్టీఫెన్‌ డ్యూన్‌

100ఏళ్ల తర్వాత మళ్లీ ఇపుడే కనిపించిన అరుదైన లిప్‌స్టిక్‌ మొక్క

ఇంటర్నెట్ డెస్క్: మన దేశంలో అత్యంత అరుదైన లిప్‌స్టిక్‌ మొక్కను గుర్తించారు శాస్త్రవేత్తలు. లిప్‌స్టిక్‌ మొక్క శాస్త్రీయ నామం ఏస్కీనాంథస్‌ మానటే రియా డ్యూన్‌. ఈ మొక్కను బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా శాస్త్రవేత్తలు అరుణాచల్‌ప్రదేశ్‌లో కనుగొన్నారు. లిప్‌స్టిక్‌ ప్లాంట్‌ను మొదటిసారిగా అరుణాచల్‌ప్రదేశ్‌లో 1912 సంవత్సరంలో బ్రిటీష్ సైంటిస్ట్‌ స్టీఫెన్‌ డ్యూన్‌ కనిపెట్టారు. తాజాగా 2021 డిసెంబర్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌లోని అంజా జిల్లాలో రెండోసారి దీన్ని కనుగొన్నారు. వందేండ్ల తర్వాత ఇది కనిపించడం విశేషం. కాగా.. లిప్‌స్టిక్‌ మొక్క ఐయూసీఎన్‌ అంతరించి పోతున్న మొక్కజాతుల్లో ఉంది. 



ఎస్కినాంథస్ అనేది ఐస్కైన్(Aischyne) అనే పదం నుంచి వచ్చింది. దీని అర్థం వరుసగా అవమానం లేదా ఇబ్బందిగా భావించడం. ఆంథోస్, అంటే పువ్వు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఫ్లోరిస్టిక్ అధ్యయనాల సమయంలో డిసెంబర్ 2021లో అంజా జిల్లాలోని హ్యులియాంగ్ మరియు చిప్రూ నుండి ఎస్కినాంథస్ మొక్క‌కు సంబంధించిన కొన్ని నమూనాలను అప్పటి శాస్త్రవేత్తలు సేకరించారు. ఈ మొక్క పువ్వులు లిప్‌స్టిక్‌లాగే గులాబీ రంగులో ఉంటాయి. అలాగే 543 నుంచి 1134 మీటర్ల ఎత్తైన ప్రదేశాల్లోని సతత హరిత అరణ్యాల్లోనే ఇది పెరుగుతుంది. అక్టోబర్‌ నుంచి జనవరి మధ్యలో ఈ మొక్కలు పువ్వులు, కాయలు కాస్తుంది.  ఈ అత్యంత అరుదైన లిప్‌స్టిక్‌ మొక్క దాదాపు అంతరించిపోయిందనుకున్న సమయంలో మళ్లీ కనిపించడంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Updated Date - 2022-06-07T01:36:00+05:30 IST