Rajasthan: అడవుల్లో గులాబీ రంగు చిరుతపులి ప్రత్యక్షం

ABN , First Publish Date - 2021-11-11T17:25:47+05:30 IST

రాజస్థాన్‌ రాష్ట్రంలోని పాలి జిల్లాలో ఆరావళి కొండల్లో ఉన్న రణక్‌పూర్ ప్రాంతంలో అరుదైన గులాబీరంగు చిరుతపులిని గుర్తించినట్లు స్థానికులు చెప్పారు...

Rajasthan: అడవుల్లో గులాబీ రంగు చిరుతపులి ప్రత్యక్షం

జైపూర్: రాజస్థాన్‌ రాష్ట్రంలోని పాలి జిల్లాలో ఆరావళి కొండల్లో ఉన్న రణక్‌పూర్ ప్రాంతంలో అరుదైన గులాబీరంగు చిరుతపులిని గుర్తించినట్లు స్థానికులు చెప్పారు. దేశంలో గులాబీ రంగు చిరుతపులి కనిపించడం ఇదే తొలిసారి.ఇంతకుముందు సాధారణ పసుపు,గోధుమ రంగుకు బదులుగా గులాబీ రంగు కోటుపై మచ్చలతో చిరుతపులి 2012, 2019లలో దక్షిణాఫ్రికాలో కనిపించిందని రాజ్‌సమంద్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఫతే సింగ్ రాథోడ్ చెప్పారు. రణక్‌పూర్ కుంభాల్‌ఘర్‌లోని స్థానికులు గులాబీరంగు చిరుతపులిని చూశారని రాథోడ్ పేర్కొన్నారు. 


ఈ ప్రాంతంలో స్ట్రాబెర్రీ రంగుతో ఉన్నచిరుతపులి ఫొటో తీశారు.రాజస్థాన్‌ రాష్ట్రంలోని రాజ్‌సమంద్ జిల్లాలో600 చదరపు కిలోమీటర్ల భూభాగంలో ఈ అరుదైన చిరుతపులి కనిపించింది.ఆరావళి పర్వత శ్రేణులను కప్పి ఉన్న అటవీ ప్రాంతంలో చిరుతపులులు, తోడేళ్లు, చారల హైనా, బంగారు నక్క జాతులకు నిలయంగా మారింది.ఈ చిరుతపులికి స్ట్రాబెర్రీ రంగు జన్యుపరమైన పరిస్థితి వల్ల వచ్చి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. 


Updated Date - 2021-11-11T17:25:47+05:30 IST