అతిచిన్న వయస్సులోనే అరుదైన ఘనత

ABN , First Publish Date - 2022-05-27T19:06:55+05:30 IST

అతి చిన్న వయస్సులోనే ఏకంగా రెండు రికార్డులను కైవసం చేసుకొని అందరూ ఔరా... అనేలా చేసింది ఆ చిన్నారి.

అతిచిన్న వయస్సులోనే అరుదైన ఘనత

  • ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు..
  • వరల్డ్‌ వైడ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో నితీష వర్మకు స్థానం


హైదరాబాద్ సిటీ/నిజాంపేట్‌ : అతి చిన్న వయస్సులోనే ఏకంగా రెండు రికార్డులను కైవసం చేసుకొని అందరూ ఔరా... అనేలా చేసింది ఆ చిన్నారి. నిజాంపేట్‌లోని సిరి బాలాజీ టవర్స్‌కు చెందిన మధు కుమార్తె నితీష వర్మ గొట్టుముక్కల (వయస్సు 4 సంవత్సరాల 9 నెలల 17 రోజులు) చరిత్ర పూర్వ జంతువుల (ప్రీ హిస్టారిక్‌ యానిమల్స్‌) పేర్లను తెలపడంతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు, వరల్డ్‌ వైడ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో ఏక కాలంలో పేరు నమోదు చేసుకుంది. కేవలం 30 సెకన్లలో 30 చరిత్ర పూర్వ జంతువుల (బ్రోంటోథెరియం, ఆండ్రోసార్క్స్‌, పారాసెరాథెరియం వంటి తదితర జంతువల)పేర్లను చిన్నారి స్పష్టంగా చెప్పడంతో ఈ ఘనత దక్కింది. 


ఇంట్లో తల్లి మధు శిక్షణలో నితీష జంతువులను గుర్తించడం  నేర్చుకుంది. ఈ నెల 19న ఇండియా బక్‌ ఆఫ్‌ రికార్డ్సులో నమోదు చేసుకోగా వారు వెంటనే స్పందించి అదే రోజు పరీక్ష పెట్టరని తెలిపారు. అరుదైన ఘనత సాధించిన చిన్నారి నితీషను కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగుపొరుగు వారు అభినందించి, భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించాలని ఆకాంక్షించారు.

Updated Date - 2022-05-27T19:06:55+05:30 IST