rare stone: చేపలు పట్టేందుకు వెళ్లిన పిల్లలకు దొరికిన 6కిలోల అరుదైన రాయి.. చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్న ప్రజలు

Published: Tue, 02 Aug 2022 17:53:26 ISTfb-iconwhatsapp-icontwitter-icon
rare stone: చేపలు పట్టేందుకు వెళ్లిన పిల్లలకు దొరికిన 6కిలోల అరుదైన రాయి.. చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్న ప్రజలు

వింతలు, విశేషాలు చోటు చేసుకునే సందర్భాల్లో పురాణ గాధలు చర్చకు వస్తుంటాయి. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) లో ప్రస్తుతం చోటు చేసుకున్న ఘటనతో ప్రజలు రామాయణ (Ramayana) కాలాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సీతాన్వేషణకు బయలుదేరిన రాముడు.. వానర సైన్యంతో కలిసి లంకకు వెళ్లేందుకు సముద్రంపై వారధి నిర్మించిన గాధ అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కొందరు పిల్లలు నదిలో చేపలు పట్టేందుకు వెళ్లగా.. వారికి 6కిలోల అరుదైన రాయి దొరికింది. ఈ రాయి రామాయణ కాలం నాటిదే అంటూ ప్రజలు పూజలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మెయిన్‌పురి జిల్లా పరిధి అహ్మల్‌పూర్ గ్రామ పరిధిలో ఇసాన్ నది వద్ద జూలై 30న ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొందరు పిల్లలు నదిలో చేపలు పట్టేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఆరు కిలోల బరువున్న నల్ల రాయి ఒకటి నీటిలో తేలుకుంటూ వచ్చింది. దాన్ని చూసి షాక్ అయిన వారు బయటికి తీసి, గ్రామంలోకి తీసుకొచ్చారు. ఆ రాయిపై జై శ్రీరామ్ అని రాసి ఉండడంతో ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి.. రాయికి పూజలు చేస్తున్నారు. అందరి సమక్షంలో ఆ రాయిని నీళ్లలో వేయగా తేలుతూ కనిపించింది. రామసేతు వంతెన సమయంలో వాడిన రాయి ఇదేనంటూ జనం చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఆ రాయిని ఆలయంలో ఉంచి పూజలు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Viral Video: రియల్ హీరో అంటే ఇతనే.. కుటుంబ పోషణ కోసం ఇతడు పడుతున్న కష్టానికి.. సెల్యూట్ కొట్టాల్సిందే..


ఇవి కూడా చదవండిLatest News in Telugu

young woman స్పృహలోకి రాగానే పారిపోయిన స్నేహితుడు.. పార్టీ పేరు చెప్పి అతడు ఆడిన డ్రామా ఏంటంటే..Bihar news: టీచర్‌ను పాఠశాల బయటే ఉంచి తాళం వేసిన గ్రామస్తులు.. చివరకు ఈ విషయం ఎంతవరకు వెళ్లిందంటే.. Indecent behavior: కోచింగ్‌కు వచ్చిన యువతిని.. పొలంలోని గదికి తీసుకెళ్లి.. నాలుగు నెలలుగా వీడియో తీయడమే కాకుండా...ten years దాంపత్య జీవితం.. మధ్యలో ప్రియుడితో ప్రేమాయణం.. చివరకు ఇంత నాటకం ఆడుతుందని ఎవరూ ఊహించలేకపోయారు..Suspicious incident: ఊరికి దూరంగా భర్త.. ట్యూషన్ టీచర్‌తో రాత్రంతా భార్య సంభాషణ.. పొద్దున లేచి చూస్తే.. rare marriage: పుట్టుమచ్చను చూసి భర్తను గుర్తించడంతో.. 30 ఏళ్ల తర్వాత వివాహం.. కలా లేక నిజమా! అంటున్న గ్రామస్తులు..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.