
ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ‘పుష్ప: ది రైజ్’ సినిమాతో వార్తల్లో నిలిచింది రష్మిక మందన్నా. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించగా.. యంగ్ హీరో అల్లు అర్జున్ హీరోగా నటించాడు. ఈ సినిమాకి నార్త్‌లో బ్రహ్మరథం పట్టారు హిందీ ప్రేక్షకులు. దీంతో ఈ నటి ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయింది.
తాజాగా ముంబైలో మీడియా కంటపడింది ఈ బ్యూటీ. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో.. ఓ రెస్టారెంట్ నుంచి బయటికి వస్తుండగా కొందరు బాలికలు ఆమె చుట్టూ చేరారు. అందులో
తినడానికి ఓ బాలిక మనీ అడిగింది. అయితే ఆ పాపని ఏ మాత్రం పట్టించుకొని ఈ భామ కెమెరాలకు ఫోజులిచ్చి వెళ్లి కారులో కూర్చుంది. అంతేకాకుండా మరి కొందరూ అమ్మాయిలు ఈ భామ చుట్టూ చేరి ‘అక్క మీరు పుష్ప సినిమాలో నటించారు కదా’ అని అడిగింది. ఆ సమయంలోనూ ఇంకో బాలిక ఆకలేస్తుందని అడిగిన సరే పట్టించుకోకుండా వెళ్లిపోయింది రష్మికా.
దీంతో ఇది చూసిన నెటిజన్లకు కోపం వచ్చి ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. అందులో ఒకరు ‘మనసు పరంగా చూస్తే ఆమె ఎంతో పూర్’.. ‘ఇలాంటి వాళ్ల సినిమాలు చూడడం మానేస్తే కానీ ఆ పేద బాలిక బాధ ఏంటో తెలియదు. సినిమా గురించి మాట్లాడినప్పుడు ఎంతో సంతోషంతో తల ఊపిన ఆమె.. మనీ అడగగానే ఏ మాత్రం పట్టించుకోలేదు’ అని కామెంట్స్ పెట్టారు. ఆ వైరల్ వీడియోని మీరు ఓ సారి చూడండి..