Rashmika Mandanna ఎమోషనల్ పోస్ట్.. Goodbye అంటూ..

Published: Mon, 27 Jun 2022 12:24:02 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Rashmika Mandanna ఎమోషనల్ పోస్ట్.. Goodbye అంటూ..

‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటి రష్మిక మందన్నా. ఆ మూవీ హిట్ అవ్వడంతో వరుసగా స్టార్ హీరోల సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. అలాగే.. ఇతర సౌత్ ఇండియన్ భాషల్లోనూ సినిమాలు చేస్తూ అక్కడ కూడా మంచి గుర్తింపుని సాధించింది. గతేడాది అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్‌లో పాపులారిటీ సాధించింది. ఈ క్రేజ్‌తో ఈ భామ బాలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది.


యువ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా నటిస్తున్న ‘మిషన్ మజ్ను’ అనే సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనుంది. ఆ మూవీ ఇంకా విడుదల కాలేదు. ఇంతలోనే ఈ రష్మిక నటించిన రెండో బాలీవుడ్ సినిమా ‘గుడ్ బై’ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్‌ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తి కావడంతో ఎంతో ఎమోషనల్‌ అవుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. ఆ పోస్ట్‌కి.. ‘గుడ్ బై. నా బిడ్డ ‘గుడ్ బై’కు ఇది చెప్పాలని లేదు. కానీ.. చెప్పాల్సిన సమయం వచ్చేసింది. కోవిడ్, ఇతర ప్రతికూలతల మధ్య ఈ మూవీ జర్నీ ప్రారంభమై రెండు సంవత్సరాలు గడిచింది. ఎన్ని సమస్యలు ఉన్నా పార్టీ చేసుకోకుండా ఏదీ ఆపలేదు. గుడ్ ‌బై ఎలాంటి మ్యాజిక్స్ చేస్తుందో చూడాలని ఆతృతగా ఉన్నాను. బిగ్గరగా నవ్వడానికి సిద్ధంగా ఉండండి. ఈ టీమ్‌లో నేను పనిచేసిన ప్రతి ఒక్కరూ నాకు ఎప్పటికీ సూపర్ స్పెషల్‌గా ఉంటారు.. త్వరలో మళ్లీ అందరం కలిసి పని చేద్దాం.. ఇది ఎలా జరుగుతుందో నాకు తెలియదు. కానీ చాలా త్వరగా జరుగుతుంది.


అమితాబ్ బచ్చన్ సార్..మీరంటే నాకు చాలా అభిమానం. మీతో ఈ సినిమా చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉంది. మీరు ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యక్తి!. ఇలాంటి సినిమా కోసం నన్ను నమ్మి, సెలెక్ట్ చేసినందుకు వికాస్ మీకు ధన్యవాదాలు. ఫ్రెండ్స్.. నా బిడ్డ ‘గుడ్‌బై’తో త్వరలో మీ అందరినీ కలుస్తాను..మీరు సిద్ధంగా ఉండండి.. ఇంకా నేను వేచి ఉండలేను’ అని ఎంతో ఎమోషనల్‌గా రాసుకొచ్చింది. కాగా.. రష్మిక ఈ రెండు సినిమాలతో పాటు పాన్ ఇండియా మూవీ ‘పుష్ప పార్ట్ 2’, తమిళంలో నటుడు విజయ్‌తో ఓ సినిమా చేస్తూ కెరీర్‌లో బిజీగా ఉంది.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...