మరో తమిళ హీరోతో రష్మిక..?

Jul 30 2021 @ 13:51PM

మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మికమందన్న కోలీవుడ్ హీరోతో జతకట్టబోతోందని న్యూస్ ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ఈమె కోలీవుడ్‌లో కూడా అడుగుపెట్టి కార్తితో 'సుల్తాన్' సినిమా చేసింది. ఈ సినిమా తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో పాటు రష్మిక క్రేజీ స్టార్‌గా మారింది. ఈ క్రమంలో మరో కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించబోతున్న సినిమాలో రష్మికను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ఈ సినిమాకి 'జాతి రత్నాలు' ఫేం కె.వి.అనుదీప్ దర్శకత్వం వహించబోతుండగా.. తెలుగు, తమిళంలో తెరకెక్కనుందట. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించబోతున్నారు. కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.