నారాయణపేట టౌన్, జనవరి 23 : రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని స్థానిక వైదిక పాఠశాలలో రాష్ట్ర ప్రతినిధి శ్రీనివాసులు ఆధ్వ ర్యంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షునిగా రామ్మోహన్రావు, గౌరవ సలహాదారులుగా తాటి నర్సప్ప, అధ్యక్షునిగా రుద్రసముద్రం రాములు, ప్రధాన కార్య దర్శిగా విభీషణ్, సంయుక్త కార్యదర్శిగా సుదర్శన్, సాంస్కృ తిక కార్యదర్శిగా స్వామి, ప్రచార కార్యదర్శిగా కరుణాకర్, మహిళ కార్యదర్శిగా రమాదేవి, కోశాధికారిగా అశోక్, ఉపాధ్య క్షురాలిగా అనురాధలు ఎన్నికయ్యారు.