రసకందాయంలో ‘రాజంపేట’ కో-ఆప్షన్‌ ఎన్నిక

ABN , First Publish Date - 2022-05-21T05:25:23+05:30 IST

రాజంపేట మునిసిపాలిటీ కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. పాలకవర్గం ఏర్పడిన తరువాత ఆరునెలల్లో కో-ఆప్షన్‌ సభ్యులను ఎంపిక చేసుకోవాల్సి ఉంది.

రసకందాయంలో ‘రాజంపేట’ కో-ఆప్షన్‌ ఎన్నిక
ఐరాజంపేట మున్సిపల్‌ పరిపాలనా భవనం

ఎందరో ఆశావహులు ఫ బయటపడుతున్న  విభేదాలు

రాజంపేట, మే 20 : రాజంపేట మునిసిపాలిటీ కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది.  పాలకవర్గం ఏర్పడిన తరువాత ఆరునెలల్లో కో-ఆప్షన్‌ సభ్యులను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. అయితే కో-ఆప్షన్‌ సభ్యుల కోసం పలువురు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూ ఉండటం వైసీపీలోని రెండు వర్గాలు ఈ పదవుల కోసం పోటీ పడు తుండటంతో ఎంపిక ఆలస్యమైంది. కో-ఆప్షన్‌ సభ్యులుగా మైనారిటీ వర్గానికి చెందిన ఇద్దరిని ఎంపిక చేయాల్సి ఉంది. ఇందులో తప్పని సరిగా ఒక మహిళను ఎన్నుకోవాల్సి ఉంది. మరొక స్థానానికి మునిసి పాలిటీ  పరిపాలనలో అవగాహన కలిగినవారిని ఎన్నుకోవాల్సి ఉం టుంది. ఇందుకు సంబంధించి 16వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాగా, 17 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, అనంత రం 30వ తేదీ లోపల కో-ఆప్షన్‌సభ్యుల ఎన్నిక నిర్వహిసా ్తమని కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. అయితే కొందరు సభ్యు లు ఈ నోటిఫికేషన్‌పై తీవ్ర అభ్యంతరం తెలిపారు. 16వ తేదీన నోటి ఫికేషన్‌ వెలువరించినపుడు, అదే రోజు నోటీసు బోర్డులో, పత్రికల్లో ప్రకటన విడుదల చేయకుండా 20వ తేదీన ప్రకటన విడుదల చేయ డంలో ఆంతర్యం ఏమిటని వైసీపీలోని కొందరు కౌన్సిలర్లు ప్రశ్నించ డం వైసీపీలోని రెండు వర్గాల మధ్య పోరుకు కారణమవుతోంది. ఈ స్థానానికి తనను ఎంపిక చేయాలని కోరుతూ కౌన్సిలర్‌ స్థానానికి ఓ టమి చెందిన న్యాయవాది సుబ్బరామిరెడ్డి ఇప్పటికే ఎంపీని, ఎమ్మెల్యే ని, జడ్పీ చైర్మన్‌ను ఆశ్రయించారు.  మరో న్యాయవాది కె.ఎం.ఎల్‌. నరసింహ కూడా ఇదే స్థానం కోసం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో పాటు వైసీపీ లో పలువురు పోటీ పడుతున్నారు. ఇది రెండు వర్గాల మధ్య ఆధిప త్యపోరుగా మారింది. ఈ విషయమై మునిసిపల్‌ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డిని ఆంధ్రజ్యోతి వివరణ కోరగా మునిసిపల్‌ కౌన్సిల్‌ నియమ నిబంధనల మేరకే ఈ నెల 16న నోటిఫికేషన్‌ జారీ చేసి నోటీసు బోర్డులో ప్రదర్శించామని, 17 నుంచి 23వ తేదీ లోపల నామినేషన్లు వేసుకోవడానికి గడువు ఉందని, నిబంధనల మేరకు మరో వారం రోజుల్లో  కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక నిర్వహిస్తామని వివరించారు. 

Updated Date - 2022-05-21T05:25:23+05:30 IST