వామపక్షాల ఆధ్వర్యంలో..‘గూడెం’లో రాస్తారోకో

ABN , First Publish Date - 2020-12-04T03:38:12+05:30 IST

వామపక్షాల ఆధ్వర్యంలో..‘గూడెం’లో రాస్తారోకో

వామపక్షాల ఆధ్వర్యంలో..‘గూడెం’లో రాస్తారోకో
రాస్తారోకో నిర్వహిస్తున్న దృశ్యం

కొత్తగూడెం, డిసెంబరు 3: కార్పొరేట్‌కు, దళారులకు అను కూలంగా కేంద్రం రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాల రద్దే ఏకైక లక్ష్యంతో ఢిల్లీలో దేశ రైతాంగం మోదీ ప్రభుత్వంపై పోరాడుతోందని, ఆకలితో అలమటిస్తూ ఉద్యమాన్ని ముందుకు సాగిస్తున్న అన్నంపెట్టే రైతన్నకు యావత్‌ దేశం అండగా ఉంటుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం జిల్లా నాయకులు అన్నవర పు సత్యనారాయణ, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఎల్‌. విశ్వనాథం, పి.సతీష్‌, కాంగ్రెస్‌ జిల్లా నాయకులు కాలం నాగ భూషణం, టీజేఎస్‌ జిల్లా నాయకులు శివప్రసాద్‌ స్పష్టం చేశా రు. రైతు ఆందోళనకారులపై ఢిల్లీలో పోలీసులు జరుపుతున్న దాడులు, డిమాండ్ల పరిష్కారంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వామపక్ష, విపక్ష పార్టీలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని ఓల్డ్‌ డిపో సెంటర్‌లో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. గంటపాటు రాస్తారోకో చేపట్టడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.... నష్టదాయకంగా ఉన్న వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు ఉద్యమిస్తుంటే కేంద్రం పెడచెవిన పెడుతోందన్నారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తూ రైతుల సహనాన్ని పరీక్షిస్తోందని విమర్శించారు. ఉద్యమాన్ని నీరుగా ర్చేందుకు పోలీసులను ఉసిగొల్పి దాడులకు పూనుకుంటోం దన్నారు. రైతులపై దాడులు బీజేపీ పాలనకు పరాకాష్ట అన్నారు. కేంద్రం దిగిరాని పక్షంలో విపక్షాలుగా ఢిల్లీ బాటపట్టి ఉద్యమ బాధ్యతలను స్వీకరిస్తామన్నారు. ఢిల్లీలో రైతులు నిర్వ హిస్తున్న పోరాటం ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనమన్నారు. కార్యక్ర మంలో సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, రైతు, ప్రజా సంఘాల నాయకులు బందెల నర్సయ్య, గుత్తుల సత్యనారాయణ, వై. శ్రీ నివాసరెడ్డి, చంద్రగిరి శ్రీనివాసరావు, కంచర్ల జమలయ్య, రత్న కుమారి, అన్నవరపు సత్యనారాయణ, ఎల్‌. విశ్వనాథం, పీ. సతీ ష్‌, భూక్యా రమేష్‌, జాటోతు కృష్ణ, లిక్కి బాలరాజు, లక్ష్మీ, కె. సురేందర్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-04T03:38:12+05:30 IST