రెబ్బెనలో రాస్తారోకో చేస్తున్న వామపక్ష పార్టీల నాయకులు
రెబ్బెన, మే 27: కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు గ్యాస్, పెట్రోలు, డీజిల్, ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నాయని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం మండలకేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా సీపీఐ మండలకార్యదర్శి రవీందర్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఉపేందర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడిపై పెనుభారం మోపు తున్నాయన్నారు. సీపీఐ నాయకులు గణేష్,చిప్పశంకర్, ఏఐవైఎఫ్ జిల్లా సహాయకార్యదర్శి రహీం మండల అధ్యక్షుడు రవికుమార్, ఏఐఎస్ ఎఫ్ మండల అధ్యక్షుడు జాడిసాయి, కార్యదర్శి బాలునాయక్, సీపీఐనాయకులు పీవీరెడ్డి, కాంగ్రెస్నాయకులు వెంకన్న పాల్గొన్నారు.