శ్రీనగర్-జమ్మూ Air India విమానంలో ఎలుక ప్రత్యక్షం

ABN , First Publish Date - 2022-04-22T16:23:29+05:30 IST

శ్రీనగర్-జమ్మూ ఎయిర్ ఇండియా విమానంలో ఎలుక ప్రత్యక్షం అయిన ఘటన తాజాగా వెలుగుచూసింది....

శ్రీనగర్-జమ్మూ Air India విమానంలో ఎలుక ప్రత్యక్షం

గంట ఆలస్యంపై డీజీసీఏ విచారణ

శ్రీనగర్: శ్రీనగర్-జమ్మూ ఎయిర్ ఇండియా విమానంలో ఎలుక ప్రత్యక్షం అయిన ఘటన తాజాగా వెలుగుచూసింది. శ్రీనగర్ విమానాశ్రయం నుంచి జమ్మూకు వెళ్లేందుకు  ఏఐ-822 నంబరు ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో విమానం లోపల ఓ ఎలుక ప్రత్యక్షమైంది. దీంతో విమానం తనిఖీల తర్వాత గంటకు పైగా ఆలస్యంగా బయలుదేరింది. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణకు ఆదేశించింది.శ్రీనగర్‌లోని షేక్ ఉల్-ఆలం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానం గురువారం మధ్యాహ్నం 2:15 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, ఎలుక ప్రత్యక్షం కావడంతో గంట ఆలస్యం తర్వాత 3:20 గంటలకు బయలుదేరింది. 


ఎయిర్ ఇండియా విమానాల్లో గతంలోనూ కీటకాలు, ఎలుకలు ప్రత్యక్షమయ్యాయి.గత సంవత్సరం ఢిల్లీ-న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ మధ్యలో ఉండగా గాలిలో గబ్బిలాన్ని కనుగొన్నారు. దీంతో విమాన పైలట్ తిరిగి విమానాన్ని ఢిల్లీలోని విమానాశ్రయానికి తీసుకువచ్చారు. ప్రయాణీకులను మరో విమానంలో న్యూయార్క్ కు తరలించారు. శ్రీనగర్‌ నుంచి జమ్మూ వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా ఏఐ-822 విమానంలో ఎలుక కనిపించడం వల్ల ఆలస్యమైందని శ్రీనగర్ ఎయిర్‌పోర్టు అధికారి చెప్పారు. 


Updated Date - 2022-04-22T16:23:29+05:30 IST