జూలై 1న జగన్నాథ రథయాత్ర: ఈ విశేషాలు మీకు తెలుసా?

ABN , First Publish Date - 2022-06-28T16:37:20+05:30 IST

జూలై 1వ తేదీ శుక్రవారం నుంచి ఒరిస్సాలో జగన్నాథుని...

జూలై 1న జగన్నాథ రథయాత్ర: ఈ విశేషాలు మీకు తెలుసా?

జూలై 1వ తేదీ శుక్రవారం నుంచి ఒరిస్సాలో జగన్నాథుని రథయాత్ర ప్రారంభం కానుంది. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం ఆషాఢ మాసం, శుక్ల పక్షం రెండవ రోజు నుంచి ప్రారంభమవుతుంది. రథయాత్రలో జగన్నాథుడు, బలభద్రుడు, సోదరి సుభద్ర మూడు వేర్వేరు రథాలపై ఊరేగుతారు. ఆషాఢ శుక్ల దశమి నాడు, ఈ మూడు రథాలు తిరిగి ప్రధాన ఆలయం దగ్గరకు చేరుకుంటాయి. 


రథయాత్ర సమయంలో, జగన్నాథుడు, బలభద్ర, సుభద్రలు జగన్నాథ ఆలయం నుండి జనక్‌పూర్‌లోని గుండిచా ఆలయానికి చేరుకునే దారిలో నగరాన్ని సందర్శిస్తారు. 

యాత్ర రెండవ రోజు, రథంపై ఉంచిన జగన్నాథుడు, బలభద్ర,  సుభద్ర విగ్రహాలను ఆచార వ్యవహారాల ప్రకారం, అత్తవారి ఆలయంలో ప్రతిష్ఠిస్తారు. 

స్వామివారు ఏడు రోజుల పాటు ఇక్కడే విశ్రమిస్తారు. 8వ రోజు అంటే ఆషాఢ శుక్ల దశమి నాడు రథంపై కూర్చున్న దేవతలతో యాత్ర ప్రారంభమవుతుంది. ఈ రథాల తిరుగు ప్రయాణాన్ని బహుద యాత్ర అంటారు.

జగన్నాథుని రథానికి రక్షకులు గరుడుడు, నరసింహుడు. ఈ రథంలో జయవిజయులు అనే ఇద్దరు ద్వారపాలకులు కూడా ఉంటారు.

రథంలోని గుర్రాలు తెల్లగా ఉంటాయి. వాటి పేర్లు శంఖ, బలాహక, శ్వేత హరిదాస్వ. రథాన్ని లాగే తాడును శంఖచూడ్ అంటారు. ఇది పాము పేరు.

రథయాత్రలో ఎనిమిది మంది ఋషులు కూడా ఉంటారు. ఈ ఋషులు... నారదుడు, దేవల్, వ్యాసుడు, శుక, పరాశర, విశిష్ట, విశ్వామిత్ర, రుద్రుడు.


ఈ రథయాత్రలో ఉపయోగించే రథాలు చాలా ప్రత్యేకమైన రీతిలో రూపొందించారు. రథం తయారీలో ఎలాంటి లోహాన్ని వినియోగించరు.

ఈ మూడు రథాలను పవిత్రమైన చెక్కతో తయారు చేస్తారు. రథాల తయారీకి శుభప్రదమైన చెట్లను వినియోగిస్తారు.

వసంత పంచమి నుండి రథాలకు  సంబంధించిన కలప ఎంపిక జరుగుతుంది. కలపను సేకరించాక అక్షయ తృతీయ నుండి రథాల తయారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

జగన్నాథుని రథంలో మొత్తం 16 చక్రాలు ఉంటాయి. జగన్నాథుని రథం ఎరుపు, పసుపు రంగులో ఉంటుంది. మిగిలిన రెండు రథాల కంటే ఈ రథం కొంచెం పెద్దదిగా ఉంటుంది.

జగన్నాథుని రథం వెనుక బలభద్ర, సుభద్రల రథాలు ఉంటాయి. జగన్నాథుని రథంపై హనుమంతుడు, నరసింహుని చిహ్నాలు కనిపిస్తాయి.

Updated Date - 2022-06-28T16:37:20+05:30 IST