23 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

Jun 11 2021 @ 22:37PM
అదుపులోకి తీసుకున్న బియ్యం, నిందితులతో ఎస్‌ఐ ప్రవీణ్‌ కుమార్‌

కరకగూడెం, జూన్‌ 11: అక్రమంగా తరలిస్తున్న 23 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని కరకగూడెం ఎస్‌ఐ ప్రవీ ణ్‌కుమార్‌ శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. మండల కేంద్రంలో ఎస్‌ఐ వాహనాలు తనిఖీ చేస్తుండగా 23 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని ట్రాక్టర్‌లో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. రేషన్‌ బియ్యాన్ని తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బియ్యాన్ని తరలిస్తున్న జలగం రామచంద్రయ్య, డ్రైవర్‌ జహీద్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని.. ట్రాక్టర్‌ను సీజ్‌ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పుల్లందాస్‌, దుర్గారావు, మహేష్‌ పాల్గొన్నారు.

Follow Us on: